< కీర్తనల~ గ్రంథము 68 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
Aka mawt ham David kah tingtoeng laa Pathen he thoo vetih a thunkha rhoek taekyak uh mako. A lunguet rhoek khaw a mikhmuh lamkah rhaelrham uh mako.
2 ౨ పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
Halang rhoek he Pathen hmai ah hmaikhu a yah bangla na yah vetih, hmai hmai ah khoirhat a paci bangla milh uh saeh.
3 ౩ నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
Tedae hlang dueng rhoek tah kohoenah neh Pathen hmai ah a sundaep neh a kohoe uh saeh lamtah ngaingaih uh saeh.
4 ౪ దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
Pathen te hlai lamtah a ming te tingtoeng uh lah. Vaan kolken dongah aka ngol BOEIPA ming te pomsang uh lamtah a hmai ah sundaep uh.
5 ౫ తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
Amah kah khuirhung hmuencim ah aka om Pathen tah cadah rhoek kah a napa neh nuhmai rhoek kah laitloekkung la om.
6 ౬ దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
Pathen loh oingaih cangloeng te imlo neh kho a sak sak tih thongtla rhoek te lolmangcil neh a khuen. Tedae thinthah rhoek tah rhamrhae ah kho a sakuh.
7 ౭ దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
Pathen aw na pilnam hmai ah na caeh vaengah, khopong la na luei vaengah. (Selah)
8 ౮ దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
Israel Pathen, Pathen hmai ah, Sinai Pathen hmai ah, diklai he hinghuen tih vaan khaw cip.
9 ౯ దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
Pathen namah loh kothoh khonal nan suep tih thahnoeng khaw na rho neh na thoh.
10 ౧౦ నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
Pathen nang loh mangdaeng ham na hnothen te na soepboe pah tih a khuiah na hingnah loh kho a sakuh.
11 ౧౧ ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
Ka Boeipa loh a olkhueh te a paek tih olthangthen aka phong caempuei khaw len.
12 ౧౨ సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
Manghai rhoek kah caempuei loh yong rhoela yong uh tih im kah toitlim te kutbuem la a tael.
13 ౧౩ గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
Tuvong ah na yalh uh vaengkah te, cak neh a hluk vahui phae, sui hing neh a hluk phaemul van pawn ni.
14 ౧౪ సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
Tlungthang Pathen loh a khuikah manghai rhoek a taek a yak vaengah Zalmon ah vuel bo.
15 ౧౫ బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
Pathen kah tlang, Bashan tlang, Bashan tlang kah tlang som rhoek,
16 ౧౬ శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
Ba dongah tlang som rhoek loh na pangoe uh. Te kah tlang te Pathen Amah loh khosak thil ham a nai tih BOEIPA loh yoeyah la kho a sak thil ni.
17 ౧౭ దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
Pathen kah leng tah a rhaepnah thawng thawngrha lo. Hmuencim kah aka om Sinai kah amih lakli ah Boeipa om.
18 ౧౮ నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.
Hmuen sang la na luei tih tamna rhoek na sol vaengah BOEIPA Pathen namah loh khosak puei ham hlang taeng neh thinthah rhoek taengkah kutdoe pataeng na doe.
19 ౧౯ ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
Ka Boeipa tah a hnin, hnin ah a yoethen pai saeh. Mamih kah khangnah Pathen tah mamih ham thinrhih coeng. (Selah)
20 ౨౦ మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
Mamih kah Pathen tah khangnah Pathen la om tih, ka Boeipa Yahovah taengah dueknah lamkah longrhael khaw om.
21 ౨౧ దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
Amah kah tholhnah neh aka pongpa tah Pathen loh thunkha lu bangla a luki sam soah a phop ni.
22 ౨౨ ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
Ka Boeipa loh, “Bashan lamkah kam bal puei vetih tuitunli kah a laedil lamkah kam mael puei ni.
23 ౨౩ నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
Te vaengah thunkha lamkah thii na kho na nuem thil, te na ui rhoek loh a lai neh a laeh uh vetih amih kah rhuimal khaw na pang uh ni,” a ti.
24 ౨౪ దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
Pathen namah kah lambong rhoek, ka Pathen, ka manghai kah lambong rhoek loh hmuencim la a khong uh te a hmuh uh coeng.
25 ౨౫ చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
Laa sa rhoek loh lamhma uh tih a hnukthoi loh a tumbael a tum, a laklung kah hula rhoek loh toemrhang a tum uh.
26 ౨౬ సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
Pathen te khangkhung lakli ah, BOEIPA te Israel thunsih ah uem lah.
27 ౨౭ మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
Canoi Benjamin loh Judah mangpa hlangkuk rhoek, Zebulun mangpa rhoek, Naphtali mangpa rhoek te a taemrhai.
28 ౨౮ నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
Pathen namah loh na sarhi te uen lamtah kaimih ham na saii bangla Pathen namah te mah tanglue lah.
29 ౨౯ యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
Na bawkim rhang neh manghai rhoek loh nang ham kutdoe te Jerusalem la hang khuen uh ni.
30 ౩౦ జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.
Capu mulhing ke tluung lah. Pilnam saelca rhoek neh aka lueng rhaengpuei khaw cak boeng neh a san thil. Caemrhal aka ngaih pilnam rhoek khaw a haeh.
31 ౩౧ ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.
Egypt lamkah laipai rhoek halo uh ni. Kusah loh Pathen taengah a kut a duen ni.
32 ౩౨ భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.
Diklai ram rhoek loh Pathen te hlai uh lamtah ka Boeipa te tingtoeng uh. (Selah)
33 ౩౩ అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.
Hlamat lamkah vaan dong vaan dongah aka ngol loh a ol neh sarhi ol a paek coeng ke.
34 ౩౪ దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.
Pathen kah sarhi te doek uh lah. A hoemnah neh khomong dongkah a sarhi tah Israel soah om.
35 ౩౫ దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.
Pathen namah kah rhokso ah a rhih om pai. Israel Pathen amah loh pilnam taengah sarhi neh thadueng a paek. Pathen tah a yoethen pai saeh.