< కీర్తనల~ గ్రంథము 67 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాద్యాలపై పాడేది. దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక
詩歌,交與樂官,和以絃樂。 願天主祝福我們;以祂的慈愛容光照耀我們!
2 ౨ భూమి మీద నీ మార్గాలు, జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక.
使世人認識天主的道路,萬民得知祂的救援。
3 ౩ దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక.
天主,願萬民都稱頌您,願列邦也都讚美您!
4 ౪ ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు.
您以正義統治世人,且在地上領導萬民,萬民都要踴躍歡欣。
5 ౫ దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక.
天主,願萬民都稱頌您,願列邦也都讚美您!
6 ౬ అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు.
大地為我們生產百果與五穀;天主,我們的天主給我們賜福。
7 ౭ దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.
願天主給我們祝福,願萬民都敬愛天主!