< కీర్తనల~ గ్రంథము 65 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది.
Керівнику хору. Псалом Давидів. Пісня. Тобі, Боже, належить тиха хвала на Сіоні, і перед Тобою будуть виконані обітниці.
2 ౨ ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.
Ти чуєш молитву; усе живе приходить до Тебе.
3 ౩ మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.
Здолали мене справи беззаконні, [але] Ти очистиш нас від переступів наших.
4 ౪ నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.
Блаженний той, кого Ти обираєш і наближуєш, щоб він мешкав у Твоїх дворах! Ми наситимося благами Твого дому, святого Твого Храму.
5 ౫ మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.
Ти справедливо відповідаєш нам [діяннями], що страх наводять, Боже, Рятівнику наш, надіє всіх країв землі й далеких морів!
6 ౬ బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే.
Ти, підперезаний могутністю, утверджуєш гори Своєю силою.
7 ౭ నువ్వే సముద్రాల హోరునూ వాటి అలల ఘోషనూ శాంతింపజేసేవాడివి. ప్రజల అల్లరిని అణిచేవాడివి.
Ти втихомирюєш шум морів, шум їхніх хвиль і рик племен.
8 ౮ నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.
І злякаються мешканці країв землі через знаменні діяння Твої. Вихід ранку й захід вечора Ти вигуками радості наповнюєш.
9 ౯ నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.
Ти турбуєшся про землю й напуваєш її, збагачуєш її щедро. Потік Божий повний води – Ти готуєш людям зерно, бо так влаштував Ти землю.
10 ౧౦ దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.
Ти зволожуєш її ріллю, рівняєш її борозни, розм’якшуєш рясними дощами, благословляєш її збіжжя.
11 ౧౧ సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
Ти увінчуєш рік добротою Своєю, і стежки Твої крапають жиром.
12 ౧౨ అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.
Крапають вологою пустельні пасовища, і радістю оперізуються пагорби.
13 ౧౩ గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.
Луги вдяглися отарами худоби, і долини вкрилися зерном. [Усі] радісно вигукують і співають!