< కీర్తనల~ గ్రంథము 64 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.
Èuj, Bože, glas moj u jadu mom; od strašnoga neprijatelja saèuvaj život moj.
2 దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.
Sakrij me od gomile bezakonika, od èete zloèinaca,
3 ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.
Koji naoštriše jezik svoj kao maè, strijeljaju rijeèima, koje zadaju rane,
4 నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.
Da bi iz potaje ubili pravoga. Iznenada udaraju na nj i ne boje se;
5 వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.
Utvrðuju sebe u zlijem namjerama, dogovaraju se kako æe zamke sakriti, vele: ko æe ih vidjeti?
6 వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.
Izmišljaju zloèinstva i govore: svršeno je! šta æe se raditi, smišljeno je! A što je unutra i srce u èovjeka duboko je.
7 దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.
Ali æe ih Bog poraziti; udariæe ih strijela iznenada.
8 వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.
Oboriæe jedan drugoga jezikom svojim. Ko ih god vidi, bježaæe od njih.
9 మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.
Svi æe se ljudi bojati i kazivaæe èudo Božije, i poznaæe u tome djelo njegovo.
10 ౧౦ నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.
A pravednik æe se veseliti o Gospodu i uzdaæe se u njega, i hvaliæe se svi koji su prava srca.

< కీర్తనల~ గ్రంథము 64 >