< కీర్తనల~ గ్రంథము 64 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.
達味詩歌,交與樂官。 天主,求您傾聽我哀訴的聲音,從仇敵的恐嚇中保全我生命。
2 ౨ దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.
求您掩護我遠離惡人的陰險,使我脫免作奸犯科者的暴亂;
3 ౩ ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.
他們磨礪自己的舌頭有如刀劍,他們吐出有毒的語言有如弓箭:
4 ౪ నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.
暗地裏向無辜的人擊撾,肆無忌憚,突然將他刺殺。
5 ౫ వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.
他們彼此激勵行惡,互相商議暗佈羅網;說:看見我們的究竟是誰?
6 ౬ వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.
誰能查出我們的邪思﹖我們已作成精密陰謀,走近的人必墜入深溝。
7 ౭ దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.
但是,天主必要用箭射擊他們,他們必要突然身受創痕。
8 ౮ వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.
他們的舌頭必使自己跌仆,凡見到他們的人都必搖頭。
9 ౯ మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.
眾人要恐懼,要傳述天主的作為,他們也都要細心默思他的事跡。
10 ౧౦ నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.
義人必要喜樂於上主,向他投靠,心地正直的人,必要因此而歡躍。