< కీర్తనల~ గ్రంథము 63 >
1 ౧ దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినది దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.
大卫在犹大旷野的时候,作了这诗。 神啊,你是我的 神, 我要切切地寻求你, 在干旱疲乏无水之地,我渴想你; 我的心切慕你。
2 ౨ నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.
我在圣所中曾如此瞻仰你, 为要见你的能力和你的荣耀。
3 ౩ నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.
因你的慈爱比生命更好, 我的嘴唇要颂赞你。
4 ౪ నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.
我还活的时候要这样称颂你; 我要奉你的名举手。
5 ౫ కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.
我在床上记念你, 在夜更的时候思想你; 我的心就像饱足了骨髓肥油, 我也要以欢乐的嘴唇赞美你。
6 ౬ రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.
7 ౭ నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను.
因为你曾帮助我, 我就在你翅膀的荫下欢呼。
8 ౮ నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది.
我心紧紧地跟随你; 你的右手扶持我。
9 ౯ నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు.
但那些寻索要灭我命的人 必往地底下去;
10 ౧౦ వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.
他们必被刀剑所杀, 被野狗所吃。
11 ౧౧ అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.
但是王必因 神欢喜。 凡指着他发誓的必要夸口, 因为说谎之人的口必被塞住。