< కీర్తనల~ గ్రంథము 61 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.
Чуј, Боже, вику моју, слушај молитву моју.
2 ౨ నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
Од краја земље вичем к Теби, кад клону срце моје. Изведи ме на гору, где се не могу попети.
3 ౩ నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
Јер си Ти уточиште моје, тврди заклон од непријатеља.
4 ౪ యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. (సెలా)
Да живим у стану Твом довека, и починем под кровом крила Твојих.
5 ౫ దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.
Јер Ти, Боже, чујеш завете моје и дајеш ми достојање оних који поштују име Твоје.
6 ౬ రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.
Додај дане к данима царевим, и године његове продужи од колена на колено.
7 ౭ అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.
Нека царује довека пред Богом; заповеди милости и истини нека га чувају.
8 ౮ ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.
Тако ћу певати имену Твом свагда, извршујући завете своје сваки дан.