< కీర్తనల~ గ్రంథము 60 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. షూషన్ ఎదూత్ అనే రాగంతో పాడేది. దావీదు ఆరామ్ నహరాయీమ్ వారితో అరామ్ సోబాయీ వారితో యుద్ధం చేసినప్పుడు యోవాబు ఉప్పు లోయలో పన్నెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.
Til Sangmesteren. Al-sjusjan-edut. En Miktam af David til Indøvelse,
2 ౨ నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి.
dengang han kæmpede med Aram-Naharajim og Aram-Zoba, og Joab vendte tilbage og slog Edomiterne i Saltdalen, 12 000 Mand.
3 ౩ నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు.
Gud, du har stødt os fra dig, nedbrudt os, du vrededes — vend dig til os igen;
4 ౪ సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు.
du lod Landet skælve, slaa Revner, læg nu dets Brist, thi det vakler!
5 ౫ నువ్వు ప్రేమించే వారికి విమోచన కలిగేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు.
Du lod dit Folk friste ondt, iskænked os døvende Vin.
6 ౬ తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు. నేను ఆనందిస్తాను! షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపించి ఇస్తాను.
Dem, der frygter dig, gav du et Banner, hvorhen de kan fly for Buen. (Sela)
7 ౭ గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
Til Frelse for dine elskede hjælp med din højre, bønhør os!
8 ౮ మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను.
Gud talede i sin Helligdom: »Jeg vil udskifte Sikem med Jubel, udmaale Sukkots Dal;
9 ౯ కోటగల బలమైన పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు? ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు? అన్నాడు.
mit er Gilead, mit er Manasse, Efraim er mit Hoveds Værn, Juda min Herskerstav,
10 ౧౦ దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా? మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా?
Moab min Vaskeskaal, paa Edom kaster jeg min Sko, over Filisterland jubler jeg.«
11 ౧౧ మనుషుల సహాయం ప్రయోజనం లేనిది. శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి.
Hvo bringer mig hen til den faste Stad, hvo leder mig hen til Edom?
12 ౧౨ దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.
Har du ikke, Gud, stødt os fra dig? Du ledsager ej vore Hære. Giv os dog Hjælp mod Fjenden! Blændværk er Menneskers Støtte. Med Gud skal vi øve vældige Ting, vore Fjender træder han ned!