< కీర్తనల~ గ్రంథము 6 >

1 ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యంతో, షేమినిత్ రాగంలో దావీదు కీర్తన. యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.
Müzik şefi için - Sekiz telli sazlarla Davut'un mezmuru Ya RAB, öfkeyle azarlama beni, Gazapla yola getirme.
2 యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.
Lütfet bana, ya RAB, bitkinim; Şifa ver bana, ya RAB, kemiklerim sızlıyor,
3 నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?
Çok acı çekiyorum. Ah, ya RAB! Ne zamana dek sürecek bu?
4 యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.
Gel, ya RAB, kurtar beni, Yardım et sevginden dolayı.
5 మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? (Sheol h7585)
Çünkü ölüler arasında kimse seni anmaz, Kim şükür sunar sana ölüler diyarından? (Sheol h7585)
6 నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను.
İnleye inleye bittim, Döşeğim su içinde bütün gece ağlamaktan, Yatağım sırılsıklam gözyaşlarımdan.
7 విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది.
Kederden gözlerimin feri sönüyor, Zayıflıyor gözlerim düşmanlarım yüzünden.
8 పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు.
Ey kötülük yapanlar, Uzak durun benden, Çünkü RAB ağlayışımı işitti.
9 కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.
Yalvarışımı duydu, Duamı kabul etti.
10 ౧౦ నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.
Bütün düşmanlarım utanacak, Hepsini dehşet saracak, Ansızın geri dönecekler utanç içinde.

< కీర్తనల~ గ్రంథము 6 >