< కీర్తనల~ గ్రంథము 6 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యంతో, షేమినిత్ రాగంలో దావీదు కీర్తన. యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.
Éternel, ne me reprends pas dans ton indignation, et ne me châtie pas dans ta colère.
2 ౨ యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.
Aie pitié de moi, Éternel! car je suis sans force; Éternel, guéris-moi, car mes os sont tremblants.
3 ౩ నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?
Mon âme aussi est fort troublée; et toi, Éternel, jusques à quand?
4 ౪ యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.
Reviens, Éternel, délivre mon âme; sauve-moi pour l'amour de ta bonté!
5 ౫ మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? (Sheol )
Car dans la mort on ne se souvient point de toi; qui te célébrera dans le Sépulcre? (Sheol )
6 ౬ నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను.
Je m'épuise à gémir; chaque nuit je baigne ma couche de pleurs, je trempe mon lit de mes larmes.
7 ౭ విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది.
Mon visage est tout défait de chagrin; il dépérit à cause de tous mes ennemis.
8 ౮ పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు.
Éloignez-vous de moi, vous tous, ouvriers d'iniquité! Car l'Éternel a entendu la voix de mes pleurs.
9 ౯ కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.
L'Éternel a entendu ma supplication, l'Éternel reçoit ma prière.
10 ౧౦ నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.
Tous mes ennemis seront confus et saisis d'effroi; ils reculeront, ils seront soudain couverts de honte.