< కీర్తనల~ గ్రంథము 58 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?
大卫的金诗,交与伶长。调用休要毁坏。 世人哪,你们默然不语,真合公义吗? 施行审判,岂按正直吗?
2 ౨ లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.
不然!你们是心中作恶; 你们在地上秤出你们手所行的强暴。
3 ౩ దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.
恶人一出母胎就与 神疏远, 一离母腹便走错路,说谎话。
4 ౪ వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.
他们的毒气好像蛇的毒气; 他们好像塞耳的聋虺,
5 ౫ మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.
不听行法术的声音, 虽用极灵的咒语也是不听。
6 ౬ దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.
神啊,求你敲碎他们口中的牙! 耶和华啊,求你敲掉少壮狮子的大牙!
7 ౭ పారుతున్న నీరులాగా వారు గతించిపోతారు గాక. వారు విడిచిన బాణాలు ముక్కలుగా విరిగిపోతాయి గాక.
愿他们消灭,如急流的水一般; 他们瞅准射箭的时候,愿箭头仿佛砍断。
8 ౮ వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు. నవమాసాలు నిండకుండానే పుట్టే పిండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు.
愿他们像蜗牛消化过去, 又像妇人坠落未见天日的胎。
9 ౯ మీ కుండలకు ముళ్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు.
你们用荆棘烧火,锅还未热, 他要用旋风把青的和烧着的一齐刮去。
10 ౧౦ వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.
义人见仇敌遭报就欢喜, 要在恶人的血中洗脚。
11 ౧౧ కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.
因此,人必说:义人诚然有善报; 在地上果有施行判断的 神!