< కీర్తనల~ గ్రంథము 57 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.
For the end. Destroy not: by David, for a memorial, when he fled from the presence of Saul to the cave. Have mercy, upon me, O God, have mercy upon me: for my soul has trusted in you: and in the shadow of your wings will I hope, until the iniquity have passed away.
2 మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను.
I will cry to God most high; the God who has benefited me. (Pause)
3 ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. (సెలా)
He sent from heaven and saved me; he gave to reproach them that trampled on me: God has sent forth his mercy and his truth;
4 నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు.
and he has delivered my soul from the midst of [lions']whelps: I lay down to sleep, [though] troubled. [As for] the sons of men, their teeth are arms and [missile] weapons, and their tongue a sharp sword.
5 దేవా, ఆకాశంకంటే అత్యున్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం భూమి అంతటి మీద కనబడనివ్వు.
Be you exalted, O God, above the heavens; and your glory above all the earth.
6 నా అడుగులను పట్టుకోడానికి వారు వల పన్నారు. నా ప్రాణం క్రుంగిపోయింది. వారు నా కోసం ఒక గుంట తవ్వారుగానీ దానిలో వారే పడ్డారు. (సెలా)
They have prepared snares for my feet, and have bowed down my soul: they have dug a pit before my face, and fallen into it [themselves]. (Pause)
7 నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.
My heart, O God, [is] ready, my heart [is] ready: I will sing, yes will sing psalms.
8 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.
Awake, my glory; awake, lute and harp: I will awake early.
9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
O Lord, I will give thanks to you among the nations: I will sing to you among the Gentiles.
10 ౧౦ ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.
For your mercy has been magnified even to the heavens, and your truth to the clouds.
11 ౧౧ దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.
Be you exalted, O God, above the heavens; and your glory above all the earth.

< కీర్తనల~ గ్రంథము 57 >