< కీర్తనల~ గ్రంథము 56 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన. దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.
«Εις τον πρώτον μουσικόν, επί Ιωνάθ-ελέμ-ρεχοκίμ, Μικτάμ του Δαβίδ, οπότε εκράτησαν αυτόν οι Φιλισταίοι εν Γαθ.» Ελέησόν με, ω Θεέ, διότι άνθρωπος χάσκει να με καταπίη· όλην την ημέραν πολεμών με καταθλίβει.
2 ౨ గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.
Οι εχθροί μου χάσκουσιν όλην την ημέραν να με καταπίωσι· διότι πολλοί είναι, Ύψιστε, οι πολεμούντές με.
3 ౩ నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.
Καθ' ην ημέραν φοβηθώ, επί σε θέλω ελπίζει·
4 ౪ నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?
εν τω Θεώ θέλω αινέσει τον λόγον αυτού· επί τον Θεόν ήλπισα· δεν θέλω φοβηθή· τι να μοι κάμη σαρξ;
5 ౫ రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు.
Καθ' εκάστην μεταπλάττουσι τα λόγια μου· πάντες οι διαλογισμοί αυτών είναι κατ' εμού εις κακόν.
6 ౬ వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు.
Συνάγονται, κρύπτονται, παραφυλάττουσι τα βήματά μου, πως να πιάσωσι την ψυχήν μου.
7 ౭ దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి.
Θέλουσι λυτρωθή διά της ανομίας; Θεέ, εν τη οργή σου κατακρήμνισον τους λαούς.
8 ౮ నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.
Συ αριθμείς τας αποπλανήσεις μου· θες τα δάκρυά μου εις την φιάλην σου· δεν είναι ταύτα εν τω βιβλίω σου;
9 ౯ నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.
Τότε θέλουσιν επιστρέψει οι εχθροί μου εις τα οπίσω, καθ' ην ημέραν σε επικαλεσθώ· εξεύρω τούτο, διότι ο Θεός είναι υπέρ εμού.
10 ౧౦ నా దేవుణ్ణి బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్కును ఘనపరుస్తాను.
Εν τω Θεώ θέλω αινέσει τον λόγον αυτού· εν τω Κυρίω θέλω αινέσει τον λόγον αυτού.
11 ౧౧ నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు?
Επί τον Θεόν ελπίζω· δεν θέλω φοβηθή· τι να μοι κάμη άνθρωπος;
12 ౧౨ దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.
Επάνω μου, Θεέ, είναι αι προς σε ευχαί μου· θέλω σοι αποδίδει δοξολογίας.
13 ౧౩ అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.
Διότι ελύτρωσας την ψυχήν μου εκ θανάτου, ουχί και τους πόδας μου εξ ολισθήματος, διά να περιπατώ ενώπιον του Θεού εν τω φωτί των ζώντων;