< కీర్తనల~ గ్రంథము 54 >

1 ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలమీద పాడేది. జీఫీయులు వచ్చి దావీదు మా దగ్గర దాక్కున్నాడు, అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం. దేవా, నీ నామాన్నిబట్టి నన్ను రక్షించు. నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు.
達味訓誨歌,交與樂官,和以絃樂。 作於齊弗人來對撒烏耳說:「看,達味藏在我們這裡」時。 天主,求你因你的名賜我救援,求你並以你的權能為我伸冤。
2 దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
天主,求你俯聽我的祈求,側耳傾聽我的投訴。
3 గర్వికులు నాకు వ్యతిరేకంగా లేచారు. జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారికి దేవుడంటే లెక్కలేదు.
傲慢的人起來向我進攻,蠻橫的人想謀害我的生命,他們沒有把天主放在眼中。(休止)
4 ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
請看,天主必定給我助陣,上主必扶持我生命。
5 నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదకే రప్పిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి.
求你使災禍報應在我的仇讎身上,求你憑你的忠誠將他們消除滅亡。
6 సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
我要自願向上主祭獻;上主,我要對你的美名稱讚。
7 ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.
因為你救我脫離了一切災難,使我親眼看見我的仇敵潰散。

< కీర్తనల~ గ్రంథము 54 >