< కీర్తనల~ గ్రంథము 53 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.
Načelniku godbe na piščal; pesem Davidova ukovita. Nespametni govori v srci svojem: Ni ga Boga; pohujšujejo in ostudno krivico doprinašajo, ni ga, da bi delal dobro.
2 ౨ జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.
Bog z neba gleda dol na sinove človeške, da bi videl, je li kateri, da bi bil razumen, da bi iskal Boga.
3 ౩ వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.
Vsak je odstopil, izpridili so se vsi vkup: ni ga, da bi delal dobro, ne enega samega.
4 ౪ వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు. వారికి ఏమీ తెలియడం లేదా?
Ali si niso v svesti, kateri delajo krivico, ker žró ljudstvo moje kruh jedóč, ne kličejo Boga?
5 ౫ భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.
Tam se preplašijo od groze, kjer ni groze; ker Bog razsuje kosti vsakega, kateri ima šatorišče svoje zoper tebe; osramotiš jih, ker Bog jih zameta.
6 ౬ సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.
O kdó naj dá blaginjo sè Sijona Izraelu? Ko bode nazaj peljal iz sužnjosti ljudstva svojega krdelo, veselil se bode Jakob, radoval se Izrael.