< కీర్తనల~ గ్రంథము 51 >

1 ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన. దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.
Zborovođi. Psalam. Davidov. Kad je k Davidu došao prorok Natan poslije njegova grijeha Smiluj mi se, Bože, po milosrđu svome, po velikom smilovanju izbriši moje bezakonje!
2 నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.
Operi me svega od moje krivice, od grijeha me mojeg očisti!
3 నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.
Bezakonje svoje priznajem, grijeh je moj svagda preda mnom.
4 నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.
Tebi, samom tebi ja sam zgriješio i učinio što je zlo pred tobom: pravedan ćeš biti kad progovoriš, bez prijekora kada presudiš.
5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.
Evo, grešan sam već rođen, u grijehu me zače majka moja.
6 ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.
Evo, ti ljubiš srce iskreno, u dubini duše učiš me mudrosti.
7 నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.
Poškropi me izopom da se očistim, operi me, i bit ću bjelji od snijega!
8 నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.
Objavi mi radost i veselje, nek' se obraduju kosti satrvene!
9 నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.
Odvrati lice od grijeha mojih, izbriši svu moju krivicu!
10 ౧౦ దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.
Čisto srce stvori mi, Bože, i duh postojan obnovi u meni!
11 ౧౧ నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.
Ne odbaci me od lica svojega i svoga svetog duha ne uzmi od mene!
12 ౧౨ నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.
Vrati mi radost svoga spasenja i učvrsti me duhom spremnim!
13 ౧౩ అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.
Učit ću bezakonike tvojim stazama, i grešnici tebi će se obraćati.
14 ౧౪ నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.
Oslobodi me od krvi prolivene, Bože, Bože spasitelju moj! Nek' mi jezik kliče pravednosti tvojoj!
15 ౧౫ ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.
Otvori, Gospodine, usne moje, i usta će moja naviještati hvalu tvoju.
16 ౧౬ నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు.
Žrtve ti se ne mile, kad bih dao paljenicu, ti je ne bi primio.
17 ౧౭ విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.
Žrtva Bogu duh je raskajan, srce raskajano, ponizno, Bože, nećeš prezreti.
18 ౧౮ నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు.
U svojoj dobroti milostiv budi Sionu i opet sagradi jeruzalemske zidine!
19 ౧౯ అప్పుడు నీతిమయమైన బలులు నీకు సంతోషం కలిగిస్తాయి. దహనబలుల్లోనూ, సర్వాంగ బలుల్లోనూ నువ్వు సంతోషిస్తావు. అప్పుడు ప్రజలు నీ బలిపీఠంపై ఎద్దులను అర్పిస్తారు.
Tada će ti biti mile žrtve pravedne i tad će se prinosit' teoci na žrtveniku tvojemu.

< కీర్తనల~ గ్రంథము 51 >