< కీర్తనల~ గ్రంథము 50 >

1 ఆసాపు కీర్తన శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
Бог над боговима, Господ, говори и дозива земљу од истока сунчаног до запада.
2 పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
Са Сиона, који је врх красоте, јавља се Бог.
3 మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.
Иде Бог наш, и не ћути; пред Њим је огањ који прождире, око Њега је бура велика.
4 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.
Дозива небо одозго и земљу, да суди народу свом:
5 బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
"Скупите ми свеце моје, који су учинили са мном завет на жртви."
6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.
(И небеса огласише правду Његову, јер је тај судија Бог.)
7 నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.
Слушај, народе мој, шта ћу ти казати, Израиљу, шта ћу ти јавити. Ја сам Бог, Бог твој.
8 నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
Нећу те за жртве твоје карати; твоје жртве паљенице свагда су преда мном.
9 నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
Не треба ми узимати телета из дома твог, ни јарића из торова твојих.
10 ౧౦ ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
Јер је моје све горско зверје, и стока по планинама на хиљаде.
11 ౧౧ కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.
Знам све птице по горама, и красота пољска преда мном је.
12 ౧౨ నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
Да огладним, не бих теби рекао, јер је моја васиљена и све што је у њој.
13 ౧౩ ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
Зар ја једем месо волујско, или крв јарећу пијем?
14 ౧౪ దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
Принеси Богу хвалу на жртву, и извршуј Вишњему завете своје.
15 ౧౫ సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.
Призови ме у невољи својој, избавићу те, и ти ме прослави.
16 ౧౬ కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
А безбожнику рече Бог: Зашто казујеш уредбе моје и носиш завет мој у устима својим?
17 ౧౭ ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.
А сам мрзиш на науку, и речи моје бацаш за леђа.
18 ౧౮ నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.
Кад видиш лупежа, пристајеш с њим, и с прељубочинцима имаш део.
19 ౧౯ ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.
Уста си своја пустио да говоре зло, и језик твој плете преваре.
20 ౨౦ కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.
Седиш и говориш на брата свог, сина матере своје опадаш.
21 ౨౧ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.
Ти си то чинио, ја ћутах, а ти помисли да сам ја као ти. Обличићу те, метнућу ти пред очи грехе твоје.
22 ౨౨ దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.
Разумејте ово који заборављате Бога! Иначе ћу зграбити, па неће нико избавити.
23 ౨౩ కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.
Онај мене поштује који приноси хвалу на жртву и који је путем на опазу. Ја ћу му показати спасење Божије.

< కీర్తనల~ గ్రంథము 50 >