< కీర్తనల~ గ్రంథము 50 >
1 ౧ ఆసాపు కీర్తన శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
Drottinn er alvaldur Guð. Hann kallar þjóð sína saman úr austri og vestri.
2 ౨ పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
Dýrð Guðs ljómar frá musteri hans á Síonfjalli.
3 ౩ మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.
Hann birtist í þrumugný, umlukinn eyðandi eldi og stormviðri.
4 ౪ తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.
Hann er kominn til að dæma lýð sinn. Hróp hans heyrist á himni og jörðu:
5 ౫ బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
„Safnið saman þjóð minni sem með fórnunum á altari mínu hefur gert sáttmála við mig.“
6 ౬ ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.
Guð mun dæma réttláta dóma. Himinninn vitnar um réttlæti hans.
7 ౭ నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.
Hlusta þú, þjóð mín! Ég er þinn Guð! Taktu eftir úrskurði mínum:
8 ౮ నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
Fórnir þínar tek ég gildar. Þar hefur þú sýnt trúfesti.
9 ౯ నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
En ég girnist þó ekki uxa þína og geitur,
10 ౧౦ ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
því að öll dýr jarðarinnar tilheyra mér!
11 ౧౧ కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.
Hjarðirnar á fjöllunum og fuglar loftsins – allt er það mitt.
12 ౧౨ నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
Væri ég hungraður, segði ég þér ekki frá því – allt á jörðu er mitt, ekkert er undan skilið.
13 ౧౩ ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
Nei, ég þrái ekki kjötfórnir þínar og blóðfórnir,
14 ౧౪ దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
heldur þakklæti og orðheldni.
15 ౧౫ సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.
Ákallaðu mig á degi neyðarinnar og þá mun ég frelsa þig. Og þú skalt vegsama mig. Já, þetta skaltu gera.
16 ౧౬ కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
En við hina óguðlegu segir Drottinn: „Hættið að þylja upp lögmál mitt og heimta af mér,
17 ౧౭ ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.
þið sem hafnið aga og lítilsvirðið boðorð mín.
18 ౧౮ నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.
Þið aðstoðið þjófinn og samneytið hórkörlum.
19 ౧౯ ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.
Þið bölvið og ljúgið
20 ౨౦ కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.
og baktalið bróður ykkar.
21 ౨౧ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.
Þannig ferst ykkur og svo á ég að þegja?! Er ég þá eins og þið? Nei, ég mun hegna ykkur svo ekki verður um villst.
22 ౨౨ దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.
En þið sem gleymduð Guði, fáið eitt tækifæri enn, síðan læt ég eyðinguna koma og þá er allt um seinan.
23 ౨౩ కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.
Sá sem færir þakkargjörð að fórn, heiðrar mig. Og þeir sem breyta eftir orðum mínum fá að sjá hjálpræði mitt.“