< కీర్తనల~ గ్రంథము 49 >

1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
可拉後裔的詩,交與伶長。 萬民哪,你們都當聽這話! 世上一切的居民,
2 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
無論上流下流,富足貧窮, 都當留心聽!
3 నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
我口要說智慧的言語; 我心要想通達的道理。
4 ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
我要側耳聽比喻, 用琴解謎語。
5 నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
在患難的日子,奸惡隨我腳跟,四面環繞我, 我何必懼怕?
6 వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
那些倚仗財貨自誇錢財多的人,
7 వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
一個也無法贖自己的弟兄, 也不能替他將贖價給上帝,
8 ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
叫他長遠活着,不見朽壞; 因為贖他生命的價值極貴, 只可永遠罷休。
9 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
10 ౧౦ వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
他必見智慧人死, 又見愚頑人和畜類人一同滅亡, 將他們的財貨留給別人。
11 ౧౧ వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
他們心裏思想: 他們的家室必永存, 住宅必留到萬代; 他們以自己的名稱自己的地。
12 ౧౨ కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
但人居尊貴中不能長久, 如同死亡的畜類一樣。
13 ౧౩ ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
他們行的這道本為自己的愚昧; 但他們以後的人還佩服他們的話語。 (細拉)
14 ౧౪ వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది. (Sheol h7585)
他們如同羊群派定下陰間; 死亡必作他們的牧者。 到了早晨,正直人必管轄他們; 他們的美容必被陰間所滅,以致無處可存。 (Sheol h7585)
15 ౧౫ అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు. (Sheol h7585)
只是上帝必救贖我的靈魂脫離陰間的權柄, 因他必收納我。 (細拉) (Sheol h7585)
16 ౧౬ ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
見人發財、家室增榮的時候, 你不要懼怕;
17 ౧౭ ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
因為,他死的時候甚麼也不能帶去; 他的榮耀不能隨他下去。
18 ౧౮ మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
他活着的時候,雖然自誇為有福 (你若利己,人必誇獎你);
19 ౧౯ అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
他仍必歸到他歷代的祖宗那裏, 永不見光。
20 ౨౦ ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.
人在尊貴中而不醒悟, 就如死亡的畜類一樣。

< కీర్తనల~ గ్రంథము 49 >