< కీర్తనల~ గ్రంథము 48 >
1 ౧ ఒక పాట, కోరహు వారసుల కీర్తన. మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
(고라 자손의 시. 곧 노래) 여호와는 광대하시니 우리 하나님의 성, 거룩한 산에서 극진히 찬송하리로다
2 ౨ అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
터가 높고 아름다워 온 세계가 즐거워함이여 큰 왕의 성 곧 북방에 있는 시온산이 그러하도다
3 ౩ దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.
하나님이 그 여러 궁중에서 자기를 피난처로 알리셨도다
4 ౪ చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
열왕이 모여 함께 지났음이여
5 ౫ వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
저희가 보고 놀라고 두려워 빨리 갔도다
6 ౬ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.
거기서 떨림이 저희를 잡으니 고통이 해산하는 여인 같도다
7 ౭ తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
주께서 동풍으로 다시스의 배를 깨뜨리시도다
8 ౮ సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
우리가 들은 대로 만군의 여호와의 성, 우리 하나님의 성에서 보았나니 하나님이 이를 영영히 견고케 하시리로다 (셀라)
9 ౯ దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.
하나님이여, 우리가 주의 전가운데서 주의 인자하심을 생각하였나이다
10 ౧౦ దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
하나님이여, 주의 이름과 같이 찬송도 땅끝까지 미쳤으며 주의 오른손에는 정의가 충만하나이다
11 ౧౧ న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ.
주의 판단을 인하여 시온산은 기뻐하고 유다의 딸들은 즐거워 할지어다
12 ౧౨ సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.
너희는 시온을 편답하고 그것을 순행하며 그 망대들을 계수하라
13 ౧౩ తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.
그 성벽을 자세히 보고 그 궁전을 살펴서 후대에 전하라
14 ౧౪ ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.
이 하나님은 영영히 우리 하나님이시니 우리를 죽을 때까지 인도하시리로다