< కీర్తనల~ గ్రంథము 47 >

1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.
(고라 자손의 시. 영장으로 한 노래) 너희 만민들아 손바닥을 치고 즐거운 소리로 하나님께 외칠지어다!
2 అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.
지존하신 여호와는 엄위하시고 온땅에 큰 임군이 되심이로다
3 ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు.
여호와께서 만민을 우리에게 열방을 우리 발아래 복종케하시며
4 మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం.
우리를 위하여 기업을 택하시나니 곧 사랑하신 야곱의 영화로다
5 దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
하나님이 즐거이 부르는 중에 올라가심이여, 여호와께서 나팔소리 중에 올라가시도다
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.
찬양하라! 하나님을 찬양하라! 찬양하라! 우리 왕을 찬양하라!
7 ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.
하나님은 온 땅의 왕이심이라 지혜의 시로 찬양할지어다
8 దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
하나님이 열방을 치리하시며 하나님이 그 거룩한 보좌에 앉으셨도다
9 జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.
열방의 방백들이 모임이여 아브라함의 하나님의 백성이 되도다 세상의 모든 방패는 여호와의 것임이여 저는 지존하시도다

< కీర్తనల~ గ్రంథము 47 >