< కీర్తనల~ గ్రంథము 47 >
1 ౧ ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.
可拉后裔的诗,交与伶长。 万民哪,你们都要拍掌! 要用夸胜的声音向 神呼喊!
2 ౨ అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.
因为耶和华至高者是可畏的; 他是治理全地的大君王。
3 ౩ ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు.
他叫万民服在我们以下, 又叫列邦服在我们脚下。
4 ౪ మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం.
他为我们选择产业, 就是他所爱之雅各的荣耀。 (细拉)
5 ౫ దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
神上升,有喊声相送; 耶和华上升,有角声相送。
6 ౬ దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.
你们要向 神歌颂,歌颂! 向我们王歌颂,歌颂!
7 ౭ ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.
因为 神是全地的王; 你们要用悟性歌颂。
8 ౮ దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
神作王治理万国; 神坐在他的圣宝座上。
9 ౯ జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.
列邦的君王聚集要作亚伯拉罕之 神的民。 因为世界的盾牌是属 神的; 他为至高!