< కీర్తనల~ గ్రంథము 46 >

1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం. దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.
(고라 자손의 시. 영장으로 알라못에 맞춘 노래) 하나님은 우리의 피난처시요 힘이시니 환난 중에 만날 큰 도움이시라
2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.
그러므로 땅이 변하든지 산이 흔들려 바다 가운데 빠지든지
3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. (సెలా)
바닷물이 흉용하고 뛰놀든지 그것이 넘침으로 산이 요동할지라도 우리는 두려워 아니하리로다 (셀라)
4 ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.
한 시내가 있어 나뉘어 흘러 하나님의 성 곧 지극히 높으신 자의 장막의 성소를 기쁘게 하도다
5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.
하나님이 그 성중에 거하시매 그 성이 요동치 아니할 것이라 새벽에 하나님이 도우시리로다!
6 జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది.
이방이 훤화하며 왕국이 동하였더니 저가 소리를 발하시매 땅이 녹았도다
7 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
만군의 여호와께서 우리와 함께 하시니 야곱의 하나님은 우리의 피난처시로다
8 రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.
와서 여호와의 행적을 볼찌어다 땅을 황무케 하셨도다
9 భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.
저가 땅끝까지 전쟁을 쉬게 하심이여 활을 꺾고 창을 끊으며 수레를 불 사르시는도다
10 ౧౦ నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.
이르시기를 너희는 가만히 있어 내가 하나님 됨을 알찌어다! 내가 열방과 세계중에서 높임을 받으리라 하시도다
11 ౧౧ సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.
만군의 여호와께서 우리와 함께 하시리니 야곱의 하나님은 우리의 피난처시로다

< కీర్తనల~ గ్రంథము 46 >