< కీర్తనల~ గ్రంథము 46 >
1 ౧ ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం. దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.
Dem Sangmeister. Von den Söhnen Korahs. Ein Lied von Alamot.
2 ౨ కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.
Elohim ist uns Zuflucht und Schutz, / Ein Beistand in Nöten, reichlich bewährt.
3 ౩ సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. (సెలా)
Drum fürchten wir nichts, ob auch wanket die Erde, / Ob Berge stürzen mitten ins Meer,
4 ౪ ఒక నది ఉంది, దాని ప్రవాహాలు దేవుని పట్టణాన్ని, అత్యున్నత ప్రభువు మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉన్నాయి.
Ob seine Wasser tosen und schäumen, / Von seinem Brausen die Berge erbeben. (Sela)
5 ౫ దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.
Ein Strom ist da: seine Bäche erfreun die Stadt Elohims, / Des Höchsten heilige Wohnung.
6 ౬ జాతులు ఘోషిస్తున్నాయి. రాజ్యాలు కంపిస్తున్నాయి. ఆయన తన స్వరాన్ని పెంచినప్పుడు భూమి కరిగిపోయింది.
Elohim weilt dort, sie wanket nicht / Elohim hilft ihr, wenn der Morgen naht.
7 ౭ సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
Es toben Völker, es wanken Reiche. / Erschallt sein Donner, so zittert die Erde.
8 ౮ రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.
Jahwe der Heerscharen ist mit uns, / Unsre Burg ist der Gott Jakobs. (Sela)
9 ౯ భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.
Kommt, schauet die Taten Jahwes: / Er flößt der Erde Entsetzen ein.
10 ౧౦ నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.
Er steuert dem Krieg bis ans Ende der Welt, / Zerbricht den Bogen, zerschlägt den Spieß, / Verbrennt die Wagen mit Feuer.
11 ౧౧ సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.
"Laßt ab und erkennt: ich bin Elohim, / Groß unter den Völkern und groß auf Erden." Jahwe der Heerscharen ist mit uns, / Unsre Burg ist der Gott Jakobs. (Sela)