< కీర్తనల~ గ్రంథము 45 >
1 ౧ ప్రధాన సంగీతకారుడి కోసం, శోషన్నిము రాగం పై పాడాలి. కోరహు వారసుల దైవ ధ్యానం. ఒక ప్రేమ గీతం. నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది.
For the chief musician; set to Shoshannim. A psalm of the sons of Korah. A maschil. A song of loves. My heart overflows on a good subject; I will read aloud the words I have composed about the king; my tongue is the pen of a ready writer.
2 ౨ మనుషులందరి కంటే నువ్వు అందంగా ఉన్నావు. దయా కనికరాలు నీ పెదాలపై పోశారు. కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదించాడని మాకు తెలుస్తూ ఉంది.
You are fairer than the children of mankind; grace is poured onto your lips; therefore we know that God has blessed you forever.
3 ౩ బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో.
Put your sword on your side, mighty one, in your glory and your majesty.
4 ౪ నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది.
In your majesty ride on triumphantly because of trustworthiness, meekness, and righteousness; your right hand will teach you fearful things.
5 ౫ నీ బాణాలు పదునైనవి. నీ ఎదుట ప్రజలు కూలిపోతారు. రాజు శత్రువు గుండెల్లో నీ బాణాలు గుచ్చుకుని ఉంటాయి.
Your arrows are sharp; the peoples fall under you; your arrows are in the hearts of the king's enemies.
6 ౬ దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం.
Your throne, God, is forever and ever; a scepter of justice is the scepter of your kingdom.
7 ౭ నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.
You have loved righteousness and hated wickedness; therefore God, your God, has anointed you with the oil of gladness more than your companions.
8 ౮ నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి.
All your garments smell of myrrh, aloes, and cassia; out of ivory palaces stringed instruments have made you glad.
9 ౯ గౌరవనీయులైన నీ స్త్రీలలో రాజ కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు స్వర్ణాభరణాలు ధరించుకుని రాణి నీ కుడి వైపున నిలబడి ఉంది.
Kings' daughters are among your honorable women; at your right hand stands the queen clothed in gold of Ophir.
10 ౧౦ కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో.
Listen, daughter, consider and incline your ear; forget your own people and your father's house.
11 ౧౧ ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు.
In this way the king will desire your beauty; he is your master; revere him.
12 ౧౨ తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు.
The daughter of Tyre will be there with a gift; the rich among the people will beg for your favor.
13 ౧౩ అంతఃపురంలో ఉన్న రాజకుమారి వైభవంగా ఉంది. ఆమె దుస్తులు బంగారంతో నేసినవి.
The royal daughter in the palace is all glorious; her clothing is worked with gold.
14 ౧౪ వివిధ రంగులతో అల్లిక చేసిన దుస్తులు వేసుకున్న ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తున్నారు. ఆమె వెంట ఆమెను అనుసరించే ఆమె చెలికత్తెలైన కన్యలను నీ దగ్గరకు తీసుకువస్తున్నారు.
She will be led to the king in embroidered dress; the virgins, her companions who follow her, will be brought to you.
15 ౧౫ ఆనందోత్సాహలతో వాళ్ళను తీసుకువస్తున్నారు. వాళ్ళంతా రాజ భవనంలో ప్రవేశిస్తున్నారు.
They will be led by gladness and rejoicing; they will enter into the king's palace.
16 ౧౬ నీ పితరులకు బదులుగా నీ పిల్లలుంటారు. వాళ్ళను నువ్వు భూమి అంతట్లో అధిపతులుగా నియమిస్తావు.
In the place of your fathers will be your children, whom you will make princes in all the earth.
17 ౧౭ అన్ని తరాల్లోనూ నీ నామం జ్ఞాపకం ఉండేలా నేను చేస్తాను. కాబట్టి ప్రజలు అన్ని తరాల్లో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
I will make your name to be remembered in all generations; therefore the peoples will give you thanks forever and ever.