< కీర్తనల~ గ్రంథము 44 >
1 ౧ ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.
Думнезеуле, ам аузит ку урекиле ноастре ши пэринций ноштри не-ау повестит лукрэриле пе каре ле-ай фэкут пе время лор, ын зилеле де одиниоарэ.
2 ౨ నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.
Ку мына Та ай изгонит нямурь ка сэ-й сэдешть пе ей, ай ловит попоаре ка сэ-й ынтинзь пе ей.
3 ౩ వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.
Кэч ну прин сабия лор ау пус мына пе царэ, ну брацул лор й-а мынтуит, чи дряпта Та, брацул Тэу, лумина Фецей Тале, пентру кэ ый юбяй.
4 ౪ దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.
Думнезеуле, Ту ешть Ымпэратул меу: порунчеште избэвиря луй Иаков!
5 ౫ నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.
Ку Тине доборым пе врэжмаший ноштри, ку Нумеле Тэу здробим пе потривничий ноштри.
6 ౬ నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.
Кэч ну ын аркул меу мэ ынкред, ну сабия мя мэ ва скэпа;
7 ౭ మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.
чи Ту не избэвешть де врэжмаший ноштри ши дай де рушине пе чей че не урэск.
8 ౮ మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. (సెలా)
Ной, ын фиекаре зи, не лэудэм ку Думнезеу ши пуруря слэвим Нумеле Тэу.
9 ౯ అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.
Дар Ту не лепезь, не акоперь де рушине, ну май ешь ку оштириле ноастре;
10 ౧౦ శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు.
не фачь сэ дэм досул ынаинтя врэжмашулуй, ши чей че не урэск ридикэ прэзь луате де ла ной.
11 ౧౧ వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.
Не дай ка пе ниште ой де мынкат ши не рисипешть принтре нямурь.
12 ౧౨ అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.
Винзь пе попорул Тэу пе нимик ши ну-л сокотешть де маре прец.
13 ౧౩ మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.
Не фачь де окара вечинилор ноштри, де батжокура ши де рысул челор че не ынконжоарэ.
14 ౧౪ మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు.
Не фачь де поминэ принтре нямурь ши причинэ де клэтинаре дин кап принтре попоаре.
15 ౧౫ పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా
Окара мя есте тотдяуна ынаинтя мя ши рушиня ымь акоперэ фаца
16 ౧౬ ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది.
ла гласул челуй че мэ батжокореште ши мэ окэрэште, ла ведеря врэжмашулуй ши рэзбунэторулуй.
17 ౧౭ ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు.
Тоате ачестя ни се ынтымплэ фэрэ ка ной сэ Те фи уйтат, фэрэ сэ фи кэлкат легэмынтул Тэу:
18 ౧౮ మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు.
да, инима ну ни с-а абэтут, паший ну ни с-ау депэртат де пе кэраря Та,
19 ౧౯ కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు.
ка сэ не здробешть ын локуинца шакалилор ши сэ не акоперь ку умбра морций.
20 ౨౦ ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే
Дакэ ам фи уйтат Нумеле Думнезеулуй ностру ши не-ам фи ынтинс мыниле спре ун думнезеу стрэин,
21 ౨౧ హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా?
н-ар шти Думнезеу лукрул ачеста, Ел, каре куноаште тайнеле инимий?
22 ౨౨ కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము.
Дар дин причина Та сунтем ынжунгияць ын тоате зилеле, сунтем привиць ка ниште ой сортите пентру мэчелэрие.
23 ౨౩ ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు.
Трезеште-Те! Пентру че дормь, Доамне? Трезеште-Те! Ну не лепэда пе вечие!
24 ౨౪ నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు?
Пентру че Ыць аскунзь Фаца? Пентру че уйць де ненорочиря ши апэсаря ноастрэ?
25 ౨౫ మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది.
Кэч суфлетул не есте доборыт ын цэрынэ де мыхнире, трупул ностру есте липит де пэмынт.
26 ౨౬ మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.
Скоалэ-Те ка сэ не ажуць! Избэвеште-не, пентру бунэтатя Та!