< కీర్తనల~ గ్రంథము 44 >

1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.
(고라 자손의 마스길. 영장으로 한 노래) 하나님이여, 주께서 우리 열조의 날 곧 옛날에 행하신 일을 저희가 우리에게 이르매 우리 귀로 들었나이다
2 నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.
주께서 주의 손으로 열방을 쫓으시고 열조를 심으시며 주께서 민족들은 괴롭게 하시고 열조는 번성케 하셨나이다
3 వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.
저희가 자기 칼로 땅을 얻어 차지함이 아니요 저희 팔이 저희를 구원함도 아니라 오직 주의 오른손과 팔과 얼굴의 빛으로 하셨으니 주께서 저희를 기뻐하신 연고니이다
4 దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.
하나님이여, 주는 나의 왕이시니 야곱에게 구원을 베푸소서
5 నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.
우리가 주를 의지하여 우리 대적을 누르고 우리를 치려 일어나는 자를 주의 이름으로 밟으리이다
6 నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.
나는 내 활을 의지하지 아니할 것이라 내 칼도 나를 구원치 못하리이다
7 మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.
오직 주께서 우리를 우리 대적에게서 구원하시고 우리를 미워하는 자로 수치를 당케 하셨나이다
8 మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. (సెలా)
우리가 종일 하나님으로 자랑하였나이다 우리가 하나님의 이름을 영영히 감사하리이다 (셀라)
9 అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.
그러나 이제는 주께서 우리를 버려 욕을 당케 하시고 우리 군대와 함께 나아가지 아니하시나이다
10 ౧౦ శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు.
주께서 우리를 대적에게서 돌아서게 하시니 우리를 미워하는 자가 자기를 위하여 탈취하였나이다
11 ౧౧ వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.
주께서 우리로 먹힐 양 같게 하시고 열방 중에 흩으셨나이다
12 ౧౨ అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.
주께서 주의 백성을 무료로 파심이여 저희 값으로 이익을 얻지 못하셨나이다
13 ౧౩ మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.
주께서 우리로 이웃에게 욕을 당케 하시니 둘러 있는 자가 조소하고 조롱하나이다
14 ౧౪ మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు.
주께서 우리로 열방 중에 말거리가 되게 하시며 민족 중에서 머리 흔듦을 당케 하셨나이다
15 ౧౫ పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా
나의 능욕이 종일 내 앞에 있으며 수치가 내 얼굴을 덮었으니
16 ౧౬ ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది.
나를 비방하고 후욕하는 소리를 인함이요 나의 원수와 보수자의 연고니이다
17 ౧౭ ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు.
이 모든 일이 우리에게 임하였으나 우리가 주를 잊지 아니하며 주의 언약을 어기지 아니하였나이다
18 ౧౮ మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు.
우리 마음이 퇴축지 아니하고 우리 걸음도 주의 길을 떠나지 아니하였으나
19 ౧౯ కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు.
주께서 우리를 시랑의 처소에서 심히 상해하시고 우리를 사망의 그늘로 덮으셨나이다
20 ౨౦ ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే
우리가 우리 하나님의 이름을 잊어버렸거나 우리 손을 이방 신에게 향하여 폈더면
21 ౨౧ హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా?
하나님이 이를 더듬어 내지 아니하셨으리이까? 대저 주는 마음의 비밀을 아시나이다
22 ౨౨ కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము.
우리가 종일 주를 위하여 죽임을 당케 되며 도살할 양같이 여김을 받았나이다
23 ౨౩ ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు.
주여, 깨소서 어찌하여 주무시나이까? 일어나시고 우리를 영영히 버리지 마소서
24 ౨౪ నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు?
어찌하여 주의 얼굴을 가리우시고 우리 고난과 압제를 잊으시나이까?
25 ౨౫ మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది.
우리 영혼은 진토에 구푸리고 우리 몸은 땅에 붙었나이다
26 ౨౬ మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.
일어나 우리를 도우소서 주의 인자하심을 인하여 우리를 구속하소서

< కీర్తనల~ గ్రంథము 44 >