< కీర్తనల~ గ్రంథము 39 >
1 ౧ ప్రధాన సంగీతకారుడు యెదూతూను కోసం. దావీదు కీర్తన ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి దగ్గర నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.
(Til sangmesteren. Til Jedutun. En salme af David.) Jeg sagde: "Mine Veje vil jeg vogte på, så jeg ikke synder med Tungen; min Mund vil jeg holde i Tømme, så længe den gudløse er mig nær!"
2 ౨ నేను మౌనంగా ఉన్నాను. మంచి సంగతులను కూడా పలకకుండా ఉన్నాను. నా వేదన అధికమైంది.
Jeg var stum og tavs, jeg tav for at undgå tomme Ord, men min Smerte naged,
3 ౩ నా గుండె నాలో రగులుతూ ఉంది. ఈ విషయాలను గూర్చి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా అగ్నిలా మండుతున్నది. చివరకు నేను ఇలా అన్నాను.
mit Hjerte brændte i Brystet, Ild lued op, mens jeg grunded; da talte jeg med min Tunge.
4 ౪ యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.
Lær mig, HERRE, at kende mit Endeligt, det Mål af Dage, jeg har, lad mig kende, hvor snart jeg skal bort!
5 ౫ ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. (సెలా)
Se, i Håndsbredder målte du mine Dage ud, mit Liv er som intet for dig, som et Åndepust står hvert Menneske der. (Sela)
6 ౬ నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.
Kun som en Skygge er Menneskets Vandring, kun Tomhed er deres Travlhed; de samler og ved ej, hvem der får det.
7 ౭ ప్రభూ, ఇప్పుడు నేను దేని కోసం వేచి ఉన్నాను? నాకున్న ఆధారం నువ్వే.
Hvad bier jeg, Herre, da efter? Mit Håb står ene til dig.
8 ౮ నా పాపాలన్నిటిపైనా నాకు విజయం దయచెయ్యి. మూర్ఖులు అవమానించడానికి లక్ష్యంగా నన్ను చేయవద్దు.
Fri mig for al min Synd, gør mig ikke til Spot for Dårer!
9 ౯ ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను.
Jeg tier og åbner ikke min Mund, du voldte det jo.
10 ౧౦ నన్ను గాయపరచడం ఇక ఆపు. నీ చేతి దెబ్బ నన్ను అణచివేస్తుంది.
Borttag din Plage fra mig, under din vældige Hånd går jeg til.
11 ౧౧ పాపం కారణంగా నువ్వు మనుషులను శిక్షించినప్పుడు చెద పురుగులా వారి శక్తిని నువ్వు హరిస్తావు. నిశ్చయంగా మనుషులందరూ ఆవిరిలాంటి వాళ్ళు. (సెలా)
Når du tugter en Mand med Straf for hans Brøde, smuldrer du hans Herlighed hen som Møl; kun et Åndepust er hvert Menneske. (Sela)
12 ౧౨ యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.
Hør, o HERRE, min Bøn og lyt til mit Skrig, til mine Tårer tie du ej! Thi en fremmed er jeg hos dig, en Gæst som alle mine Fædre.
13 ౧౩ నేను చనిపోయేముందు నేను సంతోషించేలా నా నుంచి నీ కోపపు చూపులు చాలించుకో.
Se bort fra mig, så jeg kvæges, før jeg går bort og ej mer er til!