< కీర్తనల~ గ్రంథము 36 >

1 ప్రధాన సంగీతకారునికి యెహోవా సేవకుడు దావీదు కీర్తన దుర్మార్గుడి హృదయంలో పాపం దివ్యవాణిలాగా మాట్లాడుతూ ఉంది. వాడి కళ్ళల్లో దేవుడి భయం కన్పించడం లేదు.
Wɔde ma dwomkyerɛfoɔ. Awurade ɔsomfoɔ Dawid dwom. Nkɔmhyɛ bi da mʼakoma so a ɛfa omumuyɛfoɔ mmarato ho. Wɔnnsuro Onyankopɔn.
2 ఎందుకంటే వాడి పాపం బయటపడదనీ, దాన్ని ఎవరూ అసహ్యించుకోరనే భ్రమలో వాడు నివసిస్తున్నాడు.
Na ɔno ankasa ani so no, ɔdaadaa ne ho dodo enti mma ɔnhunu ne bɔne nnyae yɛ.
3 వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.
Nʼanom nsɛm yɛ atirimuɔden ne nnaadaa; ɔnnim nyansa bio, na wayɛ papa.
4 వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు.
Ɔda ne mpa so mpo a, ɔbɔ pɔ bɔne; na ɔgyaa ne ho ma bɔne ɛkwan na ɔmpo deɛ ɛnyɛ.
5 యెహోవా, నీ నిబంధన కృప ఆకాశాన్ని అంటుతుంది. నీ విశ్వసనీయత మేఘాలను తాకుతుంది.
Awurade, wʼadɔeɛ duru sorosoro wo nokorɛdie duru ewiem tɔnn.
6 నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు.
Wo tenenee te sɛ mmepɔ akɛseɛ. Wʼatɛntenenee mu dɔ sɛ ɛpo bunu. Ao Awurade, wokora nnipa ne mmoa nyinaa so.
7 దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది.
Wʼadɔeɛ a ɛnsa da no som bo! Nnipa mu akɛseɛ ne nketewa nya hintabea wɔ wo ntaban nwunu ase.
8 నీ మందిరపు సమృద్ధి వలన వాళ్ళు సంపూర్ణ సంతృప్తి పొందుతున్నారు. నీ అమూల్యమైన దీవెనల జలధారలో వాళ్ళని తాగనిస్తావు.
Wɔdi deɛ abu soɔ wɔ wo fie woma wɔnom firi wʼanika asutene no mu.
9 నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.
Wo nkyɛn na nkwa asutire wɔ; wo hann mu na yɛhunu hann.
10 ౧౦ నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి.
Kɔ so dɔ wɔn a wɔnim wo, ma wo tenenee ntena wɔn a wɔtene akoma mu.
11 ౧౧ అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు.
Mma ɔhantanni nan ntia me anaa omumuyɛfoɔ nsa nnsunsum me.
12 ౧౨ అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.
Hwɛ sɛdeɛ nnebɔneyɛfoɔ ahwehwe ase, wɔdeda hɔ a wɔrentumi nsɔre bio.

< కీర్తనల~ గ్రంథము 36 >