< కీర్తనల~ గ్రంథము 36 >
1 ౧ ప్రధాన సంగీతకారునికి యెహోవా సేవకుడు దావీదు కీర్తన దుర్మార్గుడి హృదయంలో పాపం దివ్యవాణిలాగా మాట్లాడుతూ ఉంది. వాడి కళ్ళల్లో దేవుడి భయం కన్పించడం లేదు.
Al maestro del coro. Di Davide servo del Signore. Nel cuore dell'empio parla il peccato, davanti ai suoi occhi non c'è timor di Dio.
2 ౨ ఎందుకంటే వాడి పాపం బయటపడదనీ, దాన్ని ఎవరూ అసహ్యించుకోరనే భ్రమలో వాడు నివసిస్తున్నాడు.
Poiché egli si illude con se stesso nel ricercare la sua colpa e detestarla.
3 ౩ వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.
Inique e fallaci sono le sue parole, rifiuta di capire, di compiere il bene.
4 ౪ వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు.
Iniquità trama sul suo giaciglio, si ostina su vie non buone, via da sé non respinge il male.
5 ౫ యెహోవా, నీ నిబంధన కృప ఆకాశాన్ని అంటుతుంది. నీ విశ్వసనీయత మేఘాలను తాకుతుంది.
Signore, la tua grazia è nel cielo, la tua fedeltà fino alle nubi;
6 ౬ నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు.
la tua giustizia è come i monti più alti, il tuo giudizio come il grande abisso: uomini e bestie tu salvi, Signore.
7 ౭ దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది.
Quanto è preziosa la tua grazia, o Dio! Si rifugiano gli uomini all'ombra delle tue ali,
8 ౮ నీ మందిరపు సమృద్ధి వలన వాళ్ళు సంపూర్ణ సంతృప్తి పొందుతున్నారు. నీ అమూల్యమైన దీవెనల జలధారలో వాళ్ళని తాగనిస్తావు.
si saziano dell'abbondanza della tua casa e li disseti al torrente delle tue delizie.
9 ౯ నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.
E' in te la sorgente della vita, alla tua luce vediamo la luce.
10 ౧౦ నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి.
Concedi la tua grazia a chi ti conosce, la tua giustizia ai retti di cuore.
11 ౧౧ అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు.
Non mi raggiunga il piede dei superbi, non mi disperda la mano degli empi.
12 ౧౨ అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.
Ecco, sono caduti i malfattori, abbattuti, non possono rialzarsi.