< కీర్తనల~ గ్రంథము 33 >
1 ౧ నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.
Веселите се праведници пред Господом; праведнима доликује славити.
2 ౨ వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.
Славите Господа гуслама, ударајте Му у псалтир од десет жица.
3 ౩ ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.
Певајте Му песму нову, сложно ударајте подвикујући;
4 ౪ ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.
Јер је права реч Господња, и свако дело Његово истинито.
5 ౫ ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.
Он љуби правду и суд, доброте је Господње пуна земља.
6 ౬ యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.
Речју Господњом небеса се створише, и духом уста Његових сва војска њихова.
7 ౭ ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.
Као у гомилу сабра воду морску, и пропасти метну у спреме.
8 ౮ భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.
Нек се боји Господа сва земља, и нека стрепи пред Њим све што живи по васиљени;
9 ౯ ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.
Јер Он рече, и постаде; Он заповеди, и показа се.
10 ౧౦ దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
Господ разбија намере незнабошцима, уништава помисли народима.
11 ౧౧ యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
Намера је Господња тврда довека, мисли срца његова од колена на колено.
12 ౧౨ యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
Благо народу, коме је Бог Господ, племену, које је Он изабрао себи за наслеђе.
13 ౧౩ ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
С неба гледа Господ, види све синове људске;
14 ౧౪ తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు.
С престола, на коме седи, погледа на све који живе на земљи.
15 ౧౫ అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
Он је створио сва срца њихова, Он и зна сва дела њихова.
16 ౧౬ ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
Неће помоћи цару велика сила, неће заштитити јакога велика снага;
17 ౧౭ గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
Није у коњу уздање да ће помоћи; ако му је и велика снага; неће избавити.
18 ౧౮ చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,
Гле, око је Господње на онима који Га се боје, и на онима који чекају милост Његову.
19 ౧౯ యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.
Он ће душу њихову избавити од смрти, и прехранити их у гладне године.
20 ౨౦ మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే.
Душа се наша узда у Господа; Он је помоћ наша и штит наш.
21 ౨౧ మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.
О Њему се весели срце наше; јер се у свето име Његово уздамо.
22 ౨౨ యెహోవా, ఆశగా నీవైపు చూస్తున్నాం. నీ నిబంధన నిబద్ధత మాపై ఉండనియ్యి.
Да буде милост Твоја, Господе, на нама, као што се уздамо у Тебе.