< కీర్తనల~ గ్రంథము 31 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు.
Drottinn, þér einum treysti ég. Láttu ekki óvini mína yfirbuga mig. Bjargaðu mér, því að þú ert réttlátur í öllum hlutum.
2 ౨ నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
Svara mér í skyndi, nú þegar ég hrópa til þín. Beygðu þig niður að mér og hlustaðu á bæn mína. Vertu mér verndarbjarg, skjól fyrir óvinum.
3 ౩ నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు.
Já, þú ert klettur minn og vígi, sýndu mátt þinn og gerðu nafn þitt dýrlegt og bjargaðu mér.
4 ౪ నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే.
Forða fæti mínum frá snörunni sem óvinir mínir hafa lagt fyrir mig. Þú einn getur frelsað mig.
5 ౫ నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.
Í þínar hendur fel ég anda minn. Þú, Guð, sem stendur við öll þín orð, þú hefur bjargað mér. Þig einan lofa ég.
6 ౬ నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.
Ég hata alla þá sem dýrka fánýt falsgoð en Drottni treysti ég.
7 ౭ నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
Ég gleðst mjög, því að þú hefur miskunnað mér, þú gafst gaum að þrengingum mínum og sálarneyð.
8 ౮ నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
Þú framseldir mig ekki óvinum mínum, heldur rýmkaðir um mig á alla vegu.
9 ౯ యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
Ó, Drottinn, miskunna mér í neyð minni.
10 ౧౦ నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
Augu mín eru grátbólgin, heilsa mín brostin af sorg.
11 ౧౧ నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
Ár mín líða í harmi, hryggðin styttir ævi mína. Syndirnar draga úr mér allan þrótt. Hokinn stend ég – sneyptur af skömm. Óvinirnir spotta mig og nágrannarnir hæða mig. Óhug slær að vinum mínum. Þeir, jafnvel þeir, forðast að mæta mér og líta undan þegar ég geng hjá.
12 ౧౨ చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
Ég er gleymdur eins og líkið í gröf sinni – eins og brotið ker sem fleygt hefur verið á haug.
13 ౧౩ చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
Ég frétti hvað um mig var sagt – um baktal óvina minna. Ógn og skelfing var hvert sem ég leit, svik og prettir í öllum hornum!
14 ౧౪ అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
En Drottinn, þér treysti ég! Ég sagði: „Þú einn ert minn Guð, “
15 ౧౫ నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
þú ákveður ævilengd mína. Frelsaðu mig Drottinn, undan þeim sem ofsækja mig.
16 ౧౬ నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
Láttu velþóknun þína aftur verða augljósa á þjóni þínum. Frelsa mig því að þú ert góður!
17 ౧౭ యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ. (Sheol )
Drottinn, láttu mig ekki verða til skammar þegar ég ákalla þig um hjálp. Láttu illmennin blygðast sín fyrir það sem þau treysta á. Já, sendu þá sneypta og þegjandi í gröfina (Sheol )
18 ౧౮ అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
lygarana sem ásaka réttláta með hroka og fyrirlitningu.
19 ౧౯ నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
Mikil er miskunn þín við þá sem treysta þér og vitna um trúfesti þína, þá sem elska þig og heiðra í augsýn annarra.
20 ౨౦ మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
Vertu ástvinum þínum skjól gegn svikráðum manna, verndaðu þá fyrir illum tungum.
21 ౨౧ ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
Lofaður sé Drottinn, því að hann hefur sýnt mér dásamlega náð og verndað mig gegn illu.
22 ౨౨ నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.
Í fljótfærni sagði ég: „Drottinn hefur yfirgefið mig.“En hann heyrði samt bæn mína og svaraði mér!
23 ౨౩ యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
Elskið Drottin, öll þið sem honum treystið, því að Drottinn verndar trúfasta, en refsar harðlega þeim sem hafna honum í hroka.
24 ౨౪ యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.
Verið því glöð og hughraust, öll þið sem vonið á Drottin!