< కీర్తనల~ గ్రంథము 30 >
1 ౧ ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.
En psalm, en sång av David, vid templets invigning. Jag vill upphöja dig, HERRE, ty du har dragit mig ur djupet, du har icke låtit mina fiender glädja sig över mig.
2 ౨ యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.
HERRE, min Gud, jag ropade till dig, och du helade mig.
3 ౩ యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు. (Sheol )
HERRE, du förde min själ upp ur dödsriket, du tog mig levande ut från dem som foro ned i graven. (Sheol )
4 ౪ యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
Lovsjungen HERREN, I hans fromme, och prisen hans heliga namn.
5 ౫ ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.
Ty ett ögonblick varar hans vrede, men hela livet hans nåd; om aftonen gästar gråt, men om morgonen kommer jubel.
6 ౬ నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను.
Jag sade, när det gick mig väl: »Jag skall aldrig vackla.»
7 ౭ యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.
HERRE, i din nåd hade du gjort mitt berg starkt; men du fördolde ditt ansikte, då förskräcktes jag.
8 ౮ యెహోవా, నీకే నేను మొరపెట్టాను, నా ప్రభువును బతిమాలుకున్నాను.
Till dig, HERRE, ropade jag, och till Herren bad jag:
9 ౯ నేను చనిపోయి సమాధిలోకి దిగిపోతే ప్రయోజనం ఏముంది? మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ నమ్మకత్వాన్ని అది వివరిస్తుందా?
»Vad vinning har du av mitt blod, eller därav att jag far ned i graven? Kan stoftet tacka dig, kan det förkunna din trofasthet?
10 ౧౦ యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి.
Hör, o HERRE, och var mig nådig; HERRE, var min hjälpare.»
11 ౧౧ నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.
Då förvandlade du min klagan i fröjdesprång; du klädde av mig sorgens dräkt och omgjordade mig med glädje.
12 ౧౨ అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.
Därför skall min ära lovsjunga dig, utan att tystna; HERRE, min Gud, jag vill tacka dig evinnerligen.