< కీర్తనల~ గ్రంథము 30 >

1 ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.
【病後感恩歌】 聖殿祝聖的詩歌,達味作。 上主,我稱揚你,因為你救拔了我,你也沒有使我的仇敵向我自誇。
2 యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.
上主,我一向你呼號,我主,你便醫治了我。
3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు. (Sheol h7585)
上主,你由陰府中把我救出,又使我安全復生,免降幽谷。 (Sheol h7585)
4 యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
上主的聖民,請向上主歌頌,稱謝上主的聖名。
5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.
因為上主的忿怒,瞬息消散;上主的恩愛卻要終生綿延。晚間雖令人哭涕,清晨卻使人歡喜。
6 నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను.
我曾自誇說過,我永不會動搖。
7 యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.
上主,你恩待我,使我立足於穩固山岡;但是你一掩面,我便立刻感到失措驚惶。
8 యెహోవా, నీకే నేను మొరపెట్టాను, నా ప్రభువును బతిమాలుకున్నాను.
上主,我曾向你呼號,我曾向我主哀求說:
9 నేను చనిపోయి సమాధిలోకి దిగిపోతే ప్రయోజనం ఏముంది? మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ నమ్మకత్వాన్ని అది వివరిస్తుందా?
我如果降入陰府,我的血於你何益?灰土豈能讚美你,或宣揚你的忠義?
10 ౧౦ యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి.
上主,請俯聽我,憐憫我;上主,求你前來助佑我。
11 ౧౧ నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.
你把我的哀痛,給我變成了舞蹈,脫去了我的苦衣給我披上喜樂;
12 ౧౨ అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.
為此,我的心靈歌頌你,永不止息;上主,我的天主,我要永遠稱謝你!

< కీర్తనల~ గ్రంథము 30 >