< కీర్తనల~ గ్రంథము 3 >

1 తన కొడుకు అబ్షాలోము నుంచి తాను పారిపోయినప్పుడు రచించినది. దావీదు కీర్తన. యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.
Господе! Како је много непријатеља мојих! Многи устају на ме.
2 దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. (సెలా)
Многи говоре за душу моју: Нема му помоћи од Бога.
3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.
Али Ти си, Господе, штит који ме заклања, слава моја; Ти подижеш главу моју.
4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. (సెలా)
Гласом својим вичем ка Господу, и чује ме са свете горе своје.
5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.
Ја лежем, спавам и устајем, јер ме Господ чува.
6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.
Не бојим се много хиљада народа што са свих страна наваљује на ме.
7 యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు.
Устани, Господе! Помози ми, Боже мој! Јер Ти удараш по образу све непријатеље моје; разбијаш зубе безбожницима.
8 రక్షణ యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. (సెలా)
Од Господа је спасење; нека буде на народу Твом благослов Твој!

< కీర్తనల~ గ్రంథము 3 >