< కీర్తనల~ గ్రంథము 3 >
1 ౧ తన కొడుకు అబ్షాలోము నుంచి తాను పారిపోయినప్పుడు రచించినది. దావీదు కీర్తన. యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.
Yon Sòm a David lè l te sove ale devan Absalom, fis li a O SENYÈ, gade kijan lènmi mwen yo ap miltipliye; Anpil moun leve kont mwen.
2 ౨ దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. (సెలా)
Anpil moun pale de nanm mwen, “Nanpwen delivrans pou li nan Bondye.” Tan
3 ౩ కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.
Men Ou menm, O SENYÈ, se yon pwotèj ki antoure mwen, glwa mwen, ak (Sila) ki fè tèt mwen leve a.
4 ౪ నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. (సెలా)
Mwen t ap kriye a SENYÈ a ak vwa mwen; Li te reponn mwen soti nan mòn sen Li an Tan
5 ౫ నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.
Mwen te kouche e dòmi; mwen te leve, paske se SENYÈ a ki ban m fòs.
6 ౬ అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.
Mwen p ap pè menm dè milye de moun ki ta pran pozisyon kont mwen de tout kote.
7 ౭ యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు.
Leve, O SENYÈ! Sove mwen, O Bondye mwen! Paske Ou te souflete tout lènmi mwen yo. Ou te kraze dan a mechan yo.
8 ౮ రక్షణ యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. (సెలా)
Delivrans se nan SENYÈ a. Ke benediksyon Ou toujou poze sou pèp Ou a.