< కీర్తనల~ గ్రంథము 29 >
1 ౧ దావీదు కీర్తన. బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!
天主的眾子,請讚美上主,請將讚美光榮,歸於上主。
2 ౨ యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.
請將主的榮耀,歸於上主,穿上聖潔華服,朝拜上主。
3 ౩ యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.
上主的聲音響徹水面,天主雷鳴在顯示莊嚴,上主臨到澎湃的水面。
4 ౪ యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.
上主的聲音具有威權,上主的聲音具有莊嚴。
5 ౫ యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
上主的聲音劈斷香柏,上主折斷黎巴嫩香柏;
6 ౬ ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు.
使黎巴嫩像牛犢一樣舞蹈,使息爾翁像小牛一樣跳躍。
7 ౭ యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.
上主的聲音放射出火舌。
8 ౮ యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.
上主的聲音震動了曠野,上主震動了卡士德曠野。
9 ౯ యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.
上主的聲音搖撼橡樹,剝光森林;凡在祂殿中的都齊聲高呼:光榮。
10 ౧౦ యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.
上主坐在洪水之上,上主永遠高坐為王。
11 ౧౧ యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.
上主必將勇力賜給祂的百姓,上主必以平安祝福祂的人民。