< కీర్తనల~ గ్రంథము 28 >
1 ౧ దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను.
A psalm of David. Lord, my rock, I'm calling out to you. Please listen to me! For if you don't respond, I'll be like those who go down into the grave.
2 ౨ నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.
Listen as I appeal for mercy, as I call for help, as I hold up my hands in prayer towards your holy Temple.
3 ౩ దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.
Don't drag me off with the wicked, with those who do evil, who speak nicely to their neighbors while in their minds they're plotting evil.
4 ౪ వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు.
Give them what they deserve for their evil actions. Pay them back for what they've done. Give them the reward they've earned!
5 ౫ యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు.
For they don't pay any attention to what the Lord does, or to what he created. So he will destroy them—they will never be restored.
6 ౬ యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!
Praise the Lord! For he has heard my appeal for mercy!
7 ౭ యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.
The Lord is my strength and my shield. I trust in him and he helps me. I'm so happy, and I sing my thanks to him.
8 ౮ యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.
The Lord gives strength to his people; he is a safe refuge for the one he has anointed.
9 ౯ నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.
Save your people! Bless your “special possession”! Be their shepherd and carry them in your arms forever!