< కీర్తనల~ గ్రంథము 26 >

1 దావీదు కీర్తన. యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను.
Давидів.
2 యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు.
Перевір мене, Господи, і ви́пробуй мене, перетопи́ мої ни́рки та серце моє,
3 నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.
бо перед очима моїми Твоє милосердя, і в правді Твоїй я ходив.
4 మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను.
Не сидів я з людьми́ неправдивими, і не бу́ду ходити з лукавими,
5 దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.
я громаду злочи́нців знена́видів, і з грішниками я сидіти не буду.
6 నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను.
Умию в неви́нності руки свої, й обійду́ Твого, Господи, же́ртівника,
7 అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను.
щоб хвалу́ Тобі го́лосно ви́голосити, та звісти́ти про всі чу́да Твої.
8 నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.
Господи, — полюбив я оселю дому Твого́, і місце перебува́ння слави Твоєї.
9 పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు.
Не губи Ти моєї душі з нечестивими, та мого життя з кровоже́рами,
10 ౧౦ వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.
що в руках їх злоді́йство, що їхня прави́ця напо́внена пі́дкупом.
11 ౧౧ కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.
А я бу́ду ходити в своїй непоро́чності, — визволь мене та помилуй мене!
12 ౧౨ చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.
Нога моя стала на рівному місці, — на збо́рах я благословля́тиму Господа!

< కీర్తనల~ గ్రంథము 26 >