< కీర్తనల~ గ్రంథము 26 >
1 ౧ దావీదు కీర్తన. యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను.
(다윗의 시) 내가 나의 완전함에 행하였사오며 요동치 아니하고 여호와를 의지하였사오니 여호와여, 나를 판단하소서
2 ౨ యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు.
여호와여, 나를 살피시고 시험하사 내 뜻과 내 마음을 단련하소서
3 ౩ నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.
주의 인자하심이 내 목전에 있나이다 내가 주의 진리 중에 행하여
4 ౪ మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను.
허망한 사람과 같이 앉지 아니하였사오니 간사한 자와 동행치도 아니하리이다
5 ౫ దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.
내가 행악자의 집회를 미워하오니 악한 자와 같이 앉지 아니하리이다
6 ౬ నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను.
여호와여, 내가 무죄하므로 손을 씻고 주의 단에 두루 다니며
7 ౭ అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను.
감사의 소리를 들리고 주의 기이한 모든 일을 이르리이다
8 ౮ నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.
여호와여, 내가 주의 계신 집과 주의 영광이 거하는 곳을 사랑하오니
9 ౯ పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు.
내 영혼을 죄인과 함께 내 생명을 살인자와 함께 거두지 마소서
10 ౧౦ వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.
저희 손에 악특함이 있고 그 오른손에 뇌물이 가득하오나
11 ౧౧ కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.
나는 나의 완전함에 행하오리니 나를 구속하시고 긍휼히 여기소서
12 ౧౨ చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.
내 발이 평탄한 데 섰사오니 회중에서 여호와를 송축하리이다