< కీర్తనల~ గ్రంథము 25 >
1 ౧ దావీదు కీర్తన. యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
Pesem Davidova: K tebi, Gospod, dvigam dušo svojo.
2 ౨ నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
Bog moj, v té zaupam, naj se ne osramotim, sovražniki moji naj se ne radujejo nad mano.
3 ౩ నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
Tudi kdor čaka tebe, naj se ne osramoti; osramoté se naj, kateri izdajalsko ravnajo po krivem.
4 ౪ యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
Pota svoja mi kaži, Gospod; steze svoje úči me.
5 ౫ నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
Daj, da hodim po resnici tvoji, in úči me; ker ti si Bog blaginje moje, tebe čakam ves dan.
6 ౬ యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
Spomni se usmiljenja svojega, Gospod, in milosti svojih, da so od vekomaj.
7 ౭ బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
Grehov mladosti moje in pregreškov mojih ne spominjaj se; po milosti svoji spominjaj se me ti, zavoljo dobrote svoje, Gospod.
8 ౮ యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
Dober in pravičen je Gospod: zatorej uči grešnike pot;
9 ౯ దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
Dela, da hodijo krotki po pravici, in krotke uči pot svojo.
10 ౧౦ ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
Vse steze Gospodove so milost in zvestoba njim, ki hranijo zavezo njegovo in pričanja njegova.
11 ౧౧ యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
Zavoljo imena svojega, Gospod, bodeš torej prizanesel krivici moji, ker velika je.
12 ౧౨ యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
Kakošen bode mož tisti, kateri se boji Gospoda, ki ga uči, katero pot naj izvoli?
13 ౧౩ అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
Duša njegova bode prenočevala v dobrem, in seme njegovo bode dedovalo deželo.
14 ౧౪ ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
Skrivnost Gospodova biva pri njih, ki se ga bojé, in zaveza njegova, da po izkušnji priča zanje.
15 ౧౫ నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
Oči moje gledajo neprestano v Gospoda; ker on potegne iz mreže noge moje.
16 ౧౬ నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
Ozri se v mé, in milost mi stóri; ker samoten sem in ubožen.
17 ౧౭ నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
Stiske srca mojega se razširjajo; iz nadlog mojih potegni me.
18 ౧౮ నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
Poglej siromaštvo moje in težavo mojo; in odpusti vse grehe moje.
19 ౧౯ నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
Ozri se v sovražnike moje, ker močneji so; in s hudim sovraštvom me sovražijo.
20 ౨౦ నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
Reši dušo mojo in otmi me; naj se ne osramotim, ker pribegam k tebi.
21 ౨౧ నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
Poštenost naj me brani in pravica, ker tebe čakam.
22 ౨౨ దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.
Reši, Bog, Izraela vseh zatiranj njegovih.