< కీర్తనల~ గ్రంథము 25 >

1 దావీదు కీర్తన. యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
ダビデのうた ああヱホバよ わがたましひは汝をあふぎ望む
2 నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
わが神よわれなんぢに依頼めり ねがはくはわれに愧をおはしめたまふなかれ わが仇のわれに勝誇ることなからしめたまへ
3 నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
實になんぢを侯望むものははぢしめられず 故なくして信をうしなふものは愧をうけん
4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
ヱホバよなんぢの大路をわれにしめし なんぢの徑をわれにをしへたまへ
5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
我をなんぢの眞理にみちびき我ををしへたまへ 汝はわがすくひの神なり われ終日なんぢを侯望む
6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
なんぢのあはれみと仁慈とはいにしへより絶ずあり ヱホバよこれを思ひいだしたまへ
7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
わがわかきときの罪とわが愆とはおもひいでたまふなかれ ヱホバよ汝のめぐみの故になんぢの仁慈にしたがひて我をおもひいでたまヘ
8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
ヱホバはめぐみ深くして直くましませり 斯るがゆゑに道をつみびとにをしへ
9 దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
謙だるものを正義にみちびきたまはん その道をへりくだる者にしめしたまはん
10 ౧౦ ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
ヱホバのもろもろの道はそのけいやくと證詞とをまもるものには仁慈なり眞理なり
11 ౧౧ యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
わが不義はおほいなり ヱホバよ名のために之をゆるしたまヘ
12 ౧౨ యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
ヱホバをおそるる者はたれなるか 之にそのえらぶべき道をしめしたまはん
13 ౧౩ అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
かかる人のたましひは平安にすまひ その裔はくにをつぐべし
14 ౧౪ ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
ヱホバの親愛はヱホバをおそるる者とともにあり ヱホバはその契約をかれらに示したまはん
15 ౧౫ నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
わが目はつねにヱホバにむかふ ヱホバわがあしを網よりとりいだしたまふ可ればなり
16 ౧౬ నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
ねがはくは歸りきたりて我をあはれみたまへ われ獨わびしくまた苦しみをるなり
17 ౧౭ నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
願くはわが心のうれへをゆるめ我をわざはひより脱かれしめたまへ
18 ౧౮ నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
わが患難わが辛苦をかへりみ わがすべての罪をゆるしたまへ
19 ౧౯ నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
わが仇をみたまへ かれらの數はおほし情なき憾をもてわれをにくめり
20 ౨౦ నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
わがたましひをまもり我をたすけたまへ われに愧をおはしめたまふなかれ 我なんぢに依頼めばなり
21 ౨౧ నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
われなんぢを挨望むねがはくは完全と正直とわれをまもれかし 神よすべての憂よりイスラエルを贖ひいだしたまへ
22 ౨౨ దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

< కీర్తనల~ గ్రంథము 25 >