< కీర్తనల~ గ్రంథము 24 >

1 దావీదు కీర్తన. భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే.
【主的榮耀】大地和其中的萬物,屬於上主,世界和其間的居民,屬於上主。
2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
是祂在海洋上奠定了大地,是祂在江河上建立了世界。
3 యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు?
誰能上登天主的聖山?誰能居留在祂的聖殿?
4 అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే.
是那手潔心清,不慕虛幻的人,是那不發假誓,不行欺騙的人。
5 అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు.
他必獲得上主的祝福;他必獲得天主的酬報。
6 ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. (సెలా)
這樣的人是尋求上主的苖裔,追求雅各伯天主儀容的子息。
7 మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
城門,請提高你們的門楣,古老的門戶,請加大門扉,因為要歡迎光榮的君王。
8 మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.
誰是這位光榮的君主?就是英勇大能的上主,是那有力作戰的天主。
9 మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
城門,請提高高你的門楣,古老的門戶,請加大門扉,因為要歡迎光榮的君王,
10 ౧౦ మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. (సెలా)
誰是這位光榮的君主?這位光榮的君主,就是萬軍之軍的上主。

< కీర్తనల~ గ్రంథము 24 >