< కీర్తనల~ గ్రంథము 23 >
1 ౧ దావీదు కీర్తన. యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.
大衛的詩。 耶和華是我的牧者, 我必不致缺乏。
2 ౨ పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.
他使我躺臥在青草地上, 領我在可安歇的水邊。
3 ౩ నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.
他使我的靈魂甦醒, 為自己的名引導我走義路。
4 ౪ చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
我雖然行過死蔭的幽谷, 也不怕遭害, 因為你與我同在; 你的杖,你的竿,都安慰我。
5 ౫ నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.
在我敵人面前,你為我擺設筵席; 你用油膏了我的頭,使我的福杯滿溢。
6 ౬ కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.
我一生一世必有恩惠慈愛隨着我; 我且要住在耶和華的殿中,直到永遠。