< కీర్తనల~ గ్రంథము 22 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, అయ్యలెతు షహరు (జింకల లయ) రాగంలో దావీదు కీర్తన. నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు?
(Thơ của Đa-vít, soạn cho nhạc trưởng, theo điệu “Con nai buổi bình minh”) Đức Chúa Trời ôi, Đức Chúa Trời ôi, sao Ngài đành bỏ con? Đứng xa không cứu, không nghe tiếng con kêu nài?
2 ౨ నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను!
Đức Chúa Trời con ôi, con kêu cứu mỗi ngày Ngài không đáp. Con nài xin mỗi đêm, nào được yên nghỉ.
3 ౩ నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు.
Chúa vẫn ở trên ngôi, Ngài là đối tượng ngợi tôn của Ít-ra-ên.
4 ౪ మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు.
Các tổ phụ ngày xưa tin tưởng Chúa. Ngài đưa tay giải thoát lúc nguy nan.
5 ౫ వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు.
Họ kêu xin liền được Ngài cứu giúp. Tin cậy Chúa chẳng thất vọng bao giờ.
6 ౬ కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను.
Nhưng con đây chỉ là sâu bọ, chẳng phải người, là ô nhục của con người và bị thế nhân khinh bỉ.
7 ౭ నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.
Ai thấy con cũng buông lời chế giễu. Người này trề môi, người khác lắc đầu:
8 ౮ అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు.
“Có phải nó giao thác đời mình cho Chúa Hằng Hữu? Hãy để Chúa Hằng Hữu cứu giúp cho! Nếu Chúa Hằng Hữu yêu quý vui lòng về nó, hãy để Chúa Hằng Hữu đến giải thoát cho!”
9 ౯ ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు.
Chúa đã đem con ra khỏi lòng mẹ khiến con tin cậy Chúa khi còn bú mẹ.
10 ౧౦ గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.
Từ lòng mẹ, con được giao cho Chúa. Ngài là Đức Chúa Trời con trước lúc con ra đời.
11 ౧౧ ఆపద ముంచుకు వచ్చింది. నాకు దూరంగా ఉండకు. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు.
Tai ương cận kề không ai cứu giúp, Chúa ôi, xin đừng lìa bỏ con.
12 ౧౨ చాలా ఎద్దులు, బలమైన బాషాను దేశపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి.
Kẻ thù địch đang vây quanh hung hãn; dữ dằn như bò đực Ba-san!
13 ౧౩ వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు.
Há rộng miệng muốn ăn tươi nuốt sống, như sư tử gầm thét xông vào mồi.
14 ౧౪ నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది.
Thân con bủn rủn, xương cốt con rã rời. Trái tim con như sáp, tan chảy trong con.
15 ౧౫ నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు.
Năng lực con cằn cỗi như mảnh sành. Lưỡi dán chặt, khô trong cổ họng. Chúa đặt con trong cát bụi tử vong.
16 ౧౬ కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు.
Bầy chó săn lố nhố vây bọc con; lũ hung ác tiến lại đứng vây quanh. Tay chân con đều bị họ đâm thủng.
17 ౧౭ నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు.
Con có thể đếm xương, từng chiếc. Mắt long sòng sọc, họ nhìn chăm con,
18 ౧౮ నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు.
Y phục con, họ lấy chia làm phần, bắt thăm để lấy chiếc áo choàng của con.
19 ౧౯ యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి.
Chúa Hằng Hữu ơi, xin đừng lìa xa con! Ngài là nguồn năng lực của con, xin cứu giúp con!
20 ౨౦ ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు.
Xin cứu thân con thoát khỏi lưỡi gươm; mạng sống con khỏi sư sài lang nanh vuốt của những con chó.
21 ౨౧ సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు.
Cho con thoát sư tử mồm đang há, hẳn Ngài cứu con thoát khỏi sừng bò rừng.
22 ౨౨ నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.
Con sẽ truyền Danh Chúa cho anh chị em con. Giữa hội chúng dâng lời ca ngợi Chúa.
23 ౨౩ యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి.
Hãy ngợi tôn Chúa Hằng Hữu, hỡi những người kính sợ Chúa! Hãy tôn vinh Ngài, hỡi con cháu Gia-cốp!
24 ౨౪ ఆయన బాధపడే వాళ్ళ బాధను తృణీకరించలేదు, వాళ్ళను చూసి ఆయన అసహ్యపడలేదు. అతనినుంచి తన ముఖం దాచుకోలేదు. బాధలో ఉన్నవాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు.
Vì Chúa không khinh ghét người cùng khốn. Ngài không xây mặt khỏi họ, nhưng nghe tiếng họ nài xin.
25 ౨౫ మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను.
Tôi sẽ ca tụng Chúa giữa kỳ đại hội. Và làm trọn lời thề trước tín dân.
26 ౨౬ బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.
Người khốn khổ sẽ ăn uống thỏa thuê. Người tìm kiếm Chúa Hằng Hữu sẽ tôn ngợi Ngài. Lòng họ tràn ngập niềm vui bất tận.
27 ౨౭ భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి.
Cả địa cầu sẽ nhớ Chúa Hằng Hữu và quay về với Ngài. Dân các nước sẽ cúi đầu thờ lạy Chúa.
28 ౨౮ ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.
Vì việc thống trị là quyền Chúa Hằng Hữu. Ngài làm vua cai quản hết muôn dân.
29 ౨౯ భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు.
Tất cả người giàu trên thế gian ăn uống và thờ phượng. Mọi người có đời sống ngắn ngủi, thân xác sẽ chôn vào cát bụi, tất cả đều phải quỳ lạy Ngài.
30 ౩౦ రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు.
Con cháu chúng ta cũng sẽ phục vụ Ngài. Các thế hệ tương lai sẽ được nghe về những việc diệu kỳ của Chúa.
31 ౩౧ వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!
Thế hệ tương lai sẽ rao truyền sự công chính của Chúa. Rằng chính Chúa đã làm mọi điều đó.