< కీర్తనల~ గ్రంథము 21 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు!
Az éneklőmesternek; Dávid zsoltára. Uram, a te erősségedben örül a király, és a te segítségedben felette örvendez.
2 ౨ అతని హృదయవాంఛను నువ్వు మంజూరు చేశావు, అతని పెదాల్లోనుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించక మానలేదు.
Szívének kivánságát megadtad néki; és ajkainak kérését nem tagadtad meg. (Szela)
3 ౩ అతని కోసం శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తెస్తావు, నువ్వు అతని తల మీద మేలిమి బంగారు కిరీటం పెట్టావు.
Sőt eléje vitted javaidnak áldásait; szín-arany koronát tettél fejére.
4 ౪ ఆయుష్షు ఇమ్మని అతడు నిన్ను అడిగాడు. నువ్వు దాన్ని అతనికిచ్చావు. శాశ్వతకాలం ఉండే దీర్ఘాయుష్షు అతనికిచ్చావు.
Életet kért tőled: adtál néki hosszú időt, örökkévalót és végtelent.
5 ౫ నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు.
Nagy az ő dicsősége a te segítséged által; fényt és méltóságot adtál reája.
6 ౬ శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.
Sőt áldássá tetted őt örökké, megvidámítottad őt színed örömével.
7 ౭ ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
Bizony a király bízik az Úrban, és nem inog meg, mert vele a Magasságosnak kegyelme.
8 ౮ నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది.
Megtalálja kezed minden ellenségedet; jobbod megtalálja gyűlölőidet.
9 ౯ నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది.
Tüzes kemenczévé teszed őket megjelenésed idején; az Úr az ő haragjában elnyeli őket és tűz emészti meg őket.
10 ౧౦ భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు.
Gyümölcsüket kiveszted e földről, és magvokat az emberek fiai közül.
11 ౧౧ వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు.
Mert gonoszságot terveztek ellened, csalárdságot gondoltak, de nem vihetik ki;
12 ౧౨ నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు.
Mert meghátráltatod őket, íved húrjait arczuknak feszíted.
13 ౧౩ యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.
Emelkedjél fel Uram, a te erőddel, hadd énekeljünk, hadd zengedezzük hatalmadat!