< కీర్తనల~ గ్రంథము 21 >

1 ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు!
大卫的诗,交与伶长。 耶和华啊,王必因你的能力欢喜; 因你的救恩,他的快乐何其大!
2 అతని హృదయవాంఛను నువ్వు మంజూరు చేశావు, అతని పెదాల్లోనుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించక మానలేదు.
他心里所愿的,你已经赐给他; 他嘴唇所求的,你未尝不应允。 (细拉)
3 అతని కోసం శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తెస్తావు, నువ్వు అతని తల మీద మేలిమి బంగారు కిరీటం పెట్టావు.
你以美福迎接他, 把精金的冠冕戴在他头上。
4 ఆయుష్షు ఇమ్మని అతడు నిన్ను అడిగాడు. నువ్వు దాన్ని అతనికిచ్చావు. శాశ్వతకాలం ఉండే దీర్ఘాయుష్షు అతనికిచ్చావు.
他向你求寿,你便赐给他, 就是日子长久,直到永远。
5 నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు.
他因你的救恩大有荣耀; 你又将尊荣威严加在他身上。
6 శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.
你使他有洪福,直到永远, 又使他在你面前欢喜快乐。
7 ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
王倚靠耶和华, 因至高者的慈爱必不摇动。
8 నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది.
你的手要搜出你的一切仇敌; 你的右手要搜出那些恨你的人。
9 నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది.
你发怒的时候,要使他们如在炎热的火炉中。 耶和华要在他的震怒中吞灭他们; 那火要把他们烧尽了。
10 ౧౦ భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు.
你必从世上灭绝他们的子孙, 从人间灭绝他们的后裔。
11 ౧౧ వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు.
因为他们有意加害于你; 他们想出计谋,却不能作成。
12 ౧౨ నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు.
你必使他们转背逃跑, 向他们的脸搭箭在弦。
13 ౧౩ యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.
耶和华啊,愿你因自己的能力显为至高! 这样,我们就唱诗,歌颂你的大能。

< కీర్తనల~ గ్రంథము 21 >