< కీర్తనల~ గ్రంథము 20 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక.
大卫的诗,交与伶长。 愿耶和华在你遭难的日子应允你; 愿名为雅各 神的高举你。
2 ౨ పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక.
愿他从圣所救助你, 从锡安坚固你,
3 ౩ ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక.
记念你的一切供献, 悦纳你的燔祭, (细拉)
4 ౪ నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.
将你心所愿的赐给你, 成就你的一切筹算。
5 ౫ అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక.
我们要因你的救恩夸胜, 要奉我们 神的名竖立旌旗。 愿耶和华成就你一切所求的!
6 ౬ యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.
现在我知道耶和华救护他的受膏者, 必从他的圣天上应允他, 用右手的能力救护他。
7 ౭ కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము.
有人靠车,有人靠马, 但我们要提到耶和华—我们 神的名。
8 ౮ వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము!
他们都屈身仆倒, 我们却起来,立得正直。
9 ౯ యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.
求耶和华施行拯救; 我们呼求的时候,愿王应允我们!