< కీర్తనల~ గ్రంథము 19 >

1 ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
Dawid dwom. Ɔsoro ka Onyankopɔn anuonyam! Wim pae mu ka ne nsa ano adwuma,
2 రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
Da biara, wɔkasa; anadwo biara, wɔda nimdeɛ adi.
3 వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.
Wonni ɔkasa, wɔnnka nsɛm; wɔnnte wɔn nne.
4 అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.
Wɔn nne akodu asase so mmaa nyinaa, na wɔn nsɛm nso akodu asase ano. Onyankopɔn asi ntamadan ama owia wɔ ɔsoro hɔ.
5 సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.
Ɛte sɛ ayeforokunu a ofi ne pia mu, te sɛ ɔbran a ne ho pere no sɛ obetu ne mmirika.
6 ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
Epue wɔ ɔsoro fa baabi na atwa ne ho akosi ano; biribiara nsiw ne hyew ho kwan.
7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
Awurade mmara yɛ pɛ, ɛkanyan ɔkra no. Ahotoso wɔ Awurade nhyehyɛe mu, ɛma nea onnim nyansa hu nyansa.
8 యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
Awurade ahyɛde teɛ; ɛma koma mu anigye. Awurade ɔhyɛ nsɛm mu da hɔ; na ebue ani.
9 యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
Awurade suro yɛ kronkron, ɛte hɔ daa. Awurade mmara nsɛm yɛ nokware na ne nyinaa teɛ.
10 ౧౦ అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
Ɛsom bo sen sikakɔkɔɔ ɛsen sikakɔkɔɔ kann; ɛyɛ dɛ sen ɛwo, ɛsen ɛwo a efi ɛwokyɛm mu.
11 ౧౧ వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
Wɔnam so bɔ wo somfo kɔkɔ se, sodi so akatua yɛ bebree.
12 ౧౨ తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.
Hena na ohu nʼankasa mfomso? Fa me mfomso a ahintaw kyɛ me.
13 ౧౩ దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.
Bɔ wʼakoa ho ban fi ɔboayɛ bɔne ho, na anhyɛ me so. Ɛno na ɛbɛma madi bem, a merenni fɔ wɔ bɔne akɛse ho.
14 ౧౪ యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.
Ma mʼanom nsɛm ne me koma mu adwene nyɛ nea ɛsɔ wʼani, Awurade me Botan ne me Gyefo. Wɔde ma dwonkyerɛfo.

< కీర్తనల~ గ్రంథము 19 >