< కీర్తనల~ గ్రంథము 18 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. సౌలునుంచీ, తన శత్రువులందరినుంచీ యెహోవా తనను విడిపించినప్పుడు యెహోవా సేవకుడైన దావీదు పాడిన స్తుతి కీర్తన యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
[Kas ma David, mwet kulansap lun Leum God, el tu onkakin nu sin Leum ke len se ma Leum God El molella lukel Saul a kutu pa mwet lokoalok lal.] Nga arulana lungse kom, LEUM GOD! Kom ku luk.
2 ౨ యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు.
LEUM GOD El eot ku luk, El nien wikla luk. God luk El mwe loeyuk luk, Ke nga muta yorol nga moul. El lisringyu oana sie mwe loeyuk; El loangeyu tuh nga in moul.
3 ౩ స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను నివేదన చేస్తాను, నేను నా శత్రువులనుంచి రక్షణ పొందుతాను.
Nga pang nu sin LEUM GOD, Ac El moliyula liki mwet lokoalok luk. Kaksakin LEUM GOD!
4 ౪ మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు
Mwe fosrnga lun misa apinyula, Ac noa lun kunausten toki nu fuk.
5 ౫ పాతాళ పాశాలు నన్ను చుట్టుముట్టాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. (Sheol )
Mwe fosrnga lun misa rauniyula, Ac mwe kwasrip lun kulyuk sruokyuwi. (Sheol )
6 ౬ నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
In ongoiya luk, nga pang nu sin LEUM GOD; Nga pang nu sin God luk Elan kasreyu. In Tempul lal El lohng pusrek, Ac El porongo pusren tung in kwafe luk.
7 ౭ అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.
Na faclu rarrar ac usrusryak; Pwelung lun eol uh mukuikui ac kusrusrsrusr, Mweyen God El kasrkusrak.
8 ౮ ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది.
Kulasr fofosryak liki infwacl. Sie e in kunausten ac mulut fol sikyak liki oalul.
9 ౯ ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది.
El ikaselik yen engyeng uh ac oatui Wi sie pukunyeng lohsr ye nial.
10 ౧౦ కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు.
El sohksok mui fin sie cherub, Ac eng uh okulla arulana mui, oana sohk lun sie won.
11 ౧౧ తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు.
El nokmulla ke lohsr; Pukunyeng matoltol, su sesesla ke kof, raunella.
12 ౧౨ ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి.
Af yohk kosra ac e firir Tuku liki sarom uh ye mutal Ac kunauselik pukunyeng lohsr matoltol uh.
13 ౧౩ యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
Na pusren LEUM GOD ngirla oana pusren pulahl inkusrao me, Ac pusren El su Fulatlana lohngyuk.
14 ౧౪ ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి వాళ్ళను బెదరగొట్టాడు.
El pusrukla pisr natul, ac akfahsryelik mwet lokoalok lal; Ke sarmelik lun sarom, El oru elos kaingelik.
15 ౧౫ యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.
Kapin meoa uh wanginla ma oan fac, Ac pwelung in faclu ikakelik, Ke kom mulat nu sin mwet lokoalok lom, O LEUM GOD, Ac ngirla nu selos ke kom kasrkusrak.
16 ౧౬ పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు.
LEUM GOD El saplakme lucngi ac sruokyuwi; El amakinyuyak liki inkof loal.
17 ౧౭ నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు.
El moliyula liki mwet lokoalok kulana luk Ac lukelos nukewa su srungayu — Elos arulana kula nu sik.
18 ౧౮ ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు.
Ke nga muta in ongoiya, elos lainyu, Tusruktu LEUM GOD El loangeyula.
19 ౧౯ విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.
El eisyula liki mwe fosrnga; El moliyula mweyen El insewowo sik.
20 ౨౦ నా నిర్దోషత్వాన్నిబట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా చేతులు పరిశుభ్రంగా ఉన్నాయి గనక ఆయన నన్ను పునరుద్ధరించాడు.
LEUM GOD El ase lacnen orekma suwohs luk; El akinsewowoyeyu mweyen wangin mwetik.
21 ౨౧ ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు.
Nga akos na ma sap lun LEUM GOD; Nga tiana forla liki God luk.
22 ౨౨ ఆయన న్యాయవిధులన్నీ నా ఎదుట ఉన్నాయి. ఆయన శాసనాలనుంచి నేను వెనుదిరగలేదు.
Nga karinganang ma sap lal nukewa; Nga tia seakos ma El sapkin.
23 ౨౩ పాపం నుంచి నేను దూరంగా ఉన్నాను. ఆయన దృష్టిలో నేను యథార్ధంగా ఉన్నాను.
El etu lah wangin ma sutuu luk, Ac lah nga sifacna taranyu tuh nga in tia oru ma koluk.
24 ౨౪ కాబట్టి, నేను నిర్దోషిగా ఉన్న కారణంగా, తన దృష్టిలో నా చేతులు పరిశుభ్రంగా ఉన్న కారణంగా యెహోవా నన్ను పునరుద్ధరించాడు.
Ke ma inge El ase lacnen orekma suwohs luk; Mweyen El etu lah wangin mwetik.
25 ౨౫ నిర్దోషుల పట్ల నిన్ను నువ్వు నిర్దోషివిగా కనపరచుకుంటావు. నమ్మదగిన వాళ్ళ పట్ల నువ్వు నమ్మదగిన వాడివిగా కనపరచుకుంటావు.
O LEUM GOD, kom oaru nu selos su oaru nu sum; Kom arulana wo nu selos su moul suwohs.
26 ౨౬ స్వచ్ఛంగా ఉన్నవాళ్ళ పట్ల నిన్ను నువ్వు స్వచ్ఛంగా కనపరచుకుంటావు. అయితే వక్రబుద్ధి గలవాళ్ళ పట్ల వికటంగా ఉంటావు.
Kom nasnas nu selos su nasnas, A kom kwaselos su koluk.
27 ౨౭ బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
Kom molelos su inse pusisel, Ac kom akpusiselyalos su inse fulat.
28 ౨౮ నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు.
O LEUM GOD, kom ase kalem nu sik; Kom sisla lohsr likiyu.
29 ౨౯ నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను.
Kom ase ku luk in lain mwet lokoalok luk, Ac akkeyeyu in fanyak ac sasla pot ku lalos.
30 ౩౦ దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.
God se inge — ma nukewa El oru arulana suwohs! Kas lal uh arulana fal in lulalfongiyuk! El oana sie mwe loeyuk Nu selos nukewa su suk molela sel.
31 ౩౧ యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది?
LEUM GOD El mukena God; El mukena mwe molela nu sesr.
32 ౩౨ ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే.
El pa God su oru tuh nga in ku, El oru inkanek luk in misla ac wo.
33 ౩౩ ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు.
El oru falkuk in okak oana falken kosro deer; El karinginyu ke nga fahsr fineol.
34 ౩౪ నా చేతులకు యుద్ధం చెయ్యడం, ఇత్తడి విల్లును వంచడం నేర్పిస్తాడు.
El akpahyeyu nu ke mweun, Tuh nga in ku in orekmakin mwe pisr kulana.
35 ౩౫ నీ రక్షణ డాలును నువ్వు నాకిచ్చావు. నీ కుడిచెయ్యి నన్ను ఆదుకుంది, నీ దయ నన్ను గొప్పచేసింది.
O LEUM GOD, kom karinginyu ac moliyu, Ac ku lom sruokyuwi in misla. Kasru lom akmwetyeyu.
36 ౩౬ జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు.
Kom karinginyu tuh in tia sruhu nga, Ac nga soenna ikori.
37 ౩౭ నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు.
Nga ukwe mwet lokoalok luk ac sruokolosi; Nga tia tui nwe ke na nga kunauselosla.
38 ౩౮ వాళ్ళు లేవలేనంతగా వాళ్ళను చితకగొట్టాను. వాళ్ళు నా కాళ్ళ కింద పడ్డారు.
Nga srunglulosi ac elos tia ku in tuyak; Elos kutangyukla ac oan alapla ye mutuk.
39 ౩౯ యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు.
Kom ase ku luk in mweun, Ac se kutangla nu sik fin mwet lokoalok luk.
40 ౪౦ నా శత్రువుల మెడ వెనుకభాగం నువ్వు నాకు అప్పగించావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను పూర్తిగా నాశనం చేశాను
Kom oru tuh mwet lokoalok luk in kaing likiyu; Nga kunauselosla su srungayu.
41 ౪౧ వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు.
Elos tung ac siyuk kasru, a wangin mwet molelosla; Elos pang nu sin LEUM GOD, a El tiana topuk.
42 ౪౨ అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను.
Nga itungulosi, ac elos ekla oana kutkut Su eng uh okla. Nga fotongolosi oana fohk furarrar inkanek uh.
43 ౪౩ ప్రజల కలహాల నుంచి నువ్వు నన్ను కాపాడావు. జాతులకు నన్ను సారధిగా చేశావు. నేను ఎరగని ప్రజలు నన్ను సేవిస్తున్నారు.
Kom moliyula liki mwet su lainyu Ac kom oru tuh nga in kol mutanfahl uh; Mwet su nga tia etu meet, inge elos orekma nu sik.
44 ౪౪ నా గురించి వినగానే వాళ్ళు నాకు లోబడుతున్నారు. పరదేశులు బలవంతంగా నాకు సాష్టాంగపడ్డారు.
Mwetsac elos epasr ye mutuk; Ke elos lohng pusrek elos akos.
45 ౪౫ తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు.
Pulaik lalos wanginla Ac elos rarrar ke elos tuku liki pot ku lalos.
46 ౪౬ యెహోవా జీవం గలవాడు. నా ఆశ్రయశిల స్తుతి పొందుతాడు గాక. నా రక్షణకర్త అయిన దేవుడు ఘనత పొందుతాడు గాక.
LEUM GOD El moul! Kaksakin El su nien molela luk! Sulkakinelik pwengpeng lun God su moliyula.
47 ౪౭ ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
El ase kutangla fin mwet lokoalok luk; El akpusiselye mutunfacl su oan ye ku luk,
48 ౪౮ ఆయన నా శత్రువుల నుంచి నన్ను విడిపించాడు! నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించావు. హింసాత్మక వ్యక్తుల నుంచి నువ్వు నన్ను రక్షించావు.
Ac moliyula liki mwet lokoalok luk. O LEUM GOD, kom ase kutangla nu sik fin mwet lokoalok luk, Ac moliyula liki mwet sulallal.
49 ౪౯ అందువల్ల యెహోవా, జాతులలో నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తాను. నీ నామానికి స్తుతుల కీర్తన పాడతాను!
Ke ma inge nga kaksakin kom inmasrlon mutunfacl uh; Nga onkakin on in kaksak nu sum.
50 ౫౦ దేవుడు తన రాజుకు గొప్ప జయం ఇస్తాడు. తాను అభిషేకించిన వాడికి, దావీదుకు అతని సంతానానికి, శాశ్వతంగా ఆయన తన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తాడు.
God El sang kutangla lulap nu sin tokosra lal; El akkalemye lungse kawil lal nu sel su El sulela, Aok, nu sel David ac fwil natul nwe tok.